ఇద్దరు నేతల ప్రస్థానం ఎలా ఉంది ?

By KTV Telugu On 2 November, 2022
image

నాడు వైఎస్సార్ పాదయాత్రకు. ఇప్పుడు రాహుల్ భారత్ జోడో యాత్రకు ఉన్న సారూప్యత ఏమిటి.. యాత్రతో వైఎస్ సాధించినదేమిటి.. రాహుల్ సాధించబోయేదేమిటి…. వాచ్ దిస్ కేటీవీ స్పెషల్

జనంతో మమేకమయ్యేందుకు నేతల యాత్రలు
2003లో వైఎస్సార్ ప్రజా ప్రస్థాన యాత్ర
2022లో రాహుల్ భారత్ జోడో యాత్ర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ పాదయాత్ర
దేశమంతా తిరుగుతున్న రాహుల్

నేతల రాజకీయ ప్రస్థానంలో యాత్రా స్పెషల్స్ బాగానే సాగుతున్నాయి. తమ రాజకీయ జీవితాన్ని సుస్థిరం చేసుకునేందుకు చాలా మంది నేతలు యాత్రలు చేశారు. అగ్రనేతలు విజయం సాధించగా కాగా.. కొందరు నేతల యాత్ర దిశాహీనమైంది. నిత్యం విమానాలు, ఫస్ట్ క్లాస్ రైళ్లలో తిరిగే నాయకులు… ప్రజలతో కనెక్ట్ అయ్యేందుకు జరిపే యాత్రల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన ప్రజా ప్రస్థాన యాత్ర సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు రాహుల్ యాత్ర కూడా సక్సెస్ కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 2003 ఏప్రిల్ లో వైఎస్సార్ ….. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి యాత్రను ప్రారంభించారు. 60 రోజులకు పైగా నడిచి ఇచ్ఛాపురంలో ముగించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతున్నారు. ఇద్దరూ ఒకే పార్టీ నేతలు.. అదే కాంగ్రెస్ నేతలన్న సంగతి మరిచిపోకూడదు….

పాదయాత్రలు చేసిన చంద్రబాబు, జగన్
కన్యాకుమారి నుంచి ఢిల్లీకి నడిచిన చంద్రశేఖర్
ప్రస్తుతం తెలంగాణలో షర్మిల పాదయాత్ర
వైఎస్సాఆర్ పాదయాత్ర చాలా డిఫరెంట్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చారు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ యాత్ర చేసిన తర్వాతే పాపులారిటీ పెరిగి…. 2019లో సీఎం అయ్యారు. జనతా పార్టీ నేత చంద్రశేఖర్ 1983లో యాత్ర చేశారు. ఆయన కూడా రాహుల్ లాగే కన్యాకుమారిలో యాత్ర ప్రారంభించారు. ఢిల్లీ వరకు వెళ్లారు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా చంద్రశేఖర్ యాత్ర సాగించారు. 1990లో చంద్రశేఖర్.. ఎనిమిది నెలల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. కొంతకాలం జగన్ కు బదులు ఉమ్మడి ఏపీలో పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిల… ప్రస్తుతం తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకుని సుదీర్ఘ యాత్రను కొనసాగిస్తున్నారు. వీటిన్నింటికి భిన్నంగా వైఎస్సార్ చేసిపట్టిన యాత్రకు ప్రత్యేకతలున్నాయి. జనం ఆయన్ను చూసేందుకు పరుగులు తీసేవారు. తమ బాధలు చెప్పుకునే వారు..

తెలంగాణలోనే యాత్రను ప్రారంభించిన వైఎస్సార్
గ్రామీణ సమస్యలపై అవగాహన పెంచుకున్న వైఎస్
భారీ బహిరంగ సభల్లో ప్రసంగించిన నేత
అప్పటి టీడీపీ తప్పిదాలను ఎండగట్టిన వైనం

నిజానికి వైఎస్ యాత్ర తెలంగాణలోనే ప్రారంభమైంది. చేవెళ్లలో మొదలైన యాత్ర.. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల మీదుగా సాగి.. పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల మీదుగా సాగిన యాత్ర …. పేద, బడుగు వర్గాల సమస్యలను అర్తం చేసుకుని, కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రూపొందించుకునేందుకు ఉపకరించింది. అప్పటి చంద్రబాబు హయాంలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతులు పడుతున్న కష్టాల నుంచి ప్రజలను కాపాడే ప్రణాళికలు రూపొందించుకునేందుకు కూడా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ యాత్ర ద్వారా ఒక అవకాశం వచ్చింది. యాత్రలో భాగంగా వైఎస్ ప్రసంగించే సభలకు జనం భారీగా తరలి వచ్చారు. యాత్రకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్లే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా జనం వచ్చి.. వైఎస్ ను కలిసి.. తమ సమస్యలు చెప్పుకునేవారు.

కాంగ్రెస్ కు ఏకైక నాయకుడిగా అవతరించిన వైఎస్
అధికారానికి రాగానే ఉచిత విద్యుత్
రుణమాఫీ, ఆరోగ్య శ్రీతో చిరస్థాయిగా నిలిచిన రాజశేఖర్ రెడ్డి
ఇప్పటికీ వైఎస్ పై తెలంగాణలో అభిమానం

పాదయాత్రతో కాంగ్రెస్ లోని ఇతర నేతలను వైఎస్ వెనక్కి నెట్టెయ్యగలిగారు. పార్టీకి ఏకైక నాయుకుడిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరు సంపాందించారు. అందుకే 2004లో కాంగ్రెస్ అధికారానికి వచ్చిన వెంటనే వేరు చర్చ లేకుండానే అధిష్టానం వైఎస్ కూ సీఎం పదవిని అప్పగించింది. ఆయన కూడా ఇచ్చిన హామీలను ఒకటొకటిగా అమలు చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్తాయిలో నిలిచిపోయారు. పంటలు పండక దిక్కుతోచని రైతులకు ఉచిత విద్యుత్, లక్ష రూపాయల రుణమాఫీతో పాటు ఆస్పత్రికి వెళ్లే స్థోమత లేక ఇబ్బంది పడుతున్న పేదలకు ఆరోగ్య శ్రీ పథకం వైఎస్ అందించిన వరాలేనని చెప్పక తప్పదు. అందుకే వైఎస్ చనిపోయి ఇన్నేళ్లయినా తెలంగాణ ప్రజలు ఆయన్ను ఆరాధ్య నేతగానే భావిస్తారు…

పొలిటికల్ వాక్యూమ్ దిశగా తెలంగాణ
అయోమయంలో కాంగ్రెస్ కేడర్
కాంగ్రెస్ లేనిది తెలంగాణ లేదన్న ఫీలింగ్ కల్పించాలి
బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను కలుపుకుపోవాలి..

వైఎస్ విపక్షంలో ఉన్నప్పుడు యాత్ర చేశారు. అధికారానికి వచ్చారు. రాహుల్ కూడా కాంగ్రెస్ పార్టీ విపక్షంలోకి వచ్చిన ఎనిమిదేళ్లకు యాత్ర చేస్తున్నారు. ఆయన రాజకీయ ఆకాంక్షలను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ క్రమంగా పొలిటికల్ వాక్యూమ్ దిశగా అడుగులు వేస్తోందన్న ఆలోచన వస్తున్న తరుణంలోనే రాహుల్ యాత్ర ప్రారంభమైంది. లీడర్ల మధ్య కొట్లాటతో కాంగ్రెస్ కేడర్ కూడా అయోమయంలోకి వెళ్లిపోయింది. రాహుల్ యాత్ర తెలంగాణ దాటి పోయిన నాటికి జనానికి అందాల్సిన సందేశాలు చాలానే ఉన్నాయి. కాంగ్రెస్ లేనిదే తెలంగాణ లేదని,… కాంగ్రెస్ కు అధికారం ఇవ్వకపోతే రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు, సాయపడే చేతులు ఉండవని నమ్మించగలగాలి. తమ వంతుగా వెనుకబడిన తరగతులు, దళిత, గిరిజన వర్గాలను కలుపుకుపోతామని చెప్పగలగాలి. కులం ఆధారిత రాజకీయాలకు దూరం జరిగినట్లు నిరూపించగలగాలి. ఇప్పటికే కాంగ్రెస్ లో ఒక సామాజిక వర్గం డామినేట్ చేస్తోందన్న ఫీలింగ్ ఉంది. ఈ పనులన్నీ వీలైనంత త్వరగా జరగాలి. అప్పుడే వైఎస్ సాధించిన సక్సెస్,,,, రాహుల్ కూడా సాధించే వీలుంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ బతుకుతుంది…