అనుకున్నాంతా అయింది! యశోద ప్రమోషన్స్ కు సమంత దూరం

By KTV Telugu On 5 November, 2022
image

ఆమె బయటికి రాదు అంటున్న నిర్మాత

మైయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది సమంత. ఎంత కష్టంగా లేకపోతే సమంత సెలైన్ బాటిల్ తో సహా డబ్బింగ్ చెబుతుంది చెప్పండి. ఈ దశలో ఆమె ప్రమోషన్ కు వస్తుంది అనుకోవడం సరికాదు. కాని 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను ప్రమోట్ చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారు చెప్పండి. అందుకే సమంత డైరెక్ట్ గా తన మూవీని ప్రమోట్ చేయనప్పటికీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచ్చేయనప్పటికీ , కేవలం మీడియాకు ఇంటర్వ్యూస్ ఇవ్వనుందట. ఆ ఒక్క విషయం మాత్రం సంతోషం పెట్టనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో విశేషం ఏంటంటే, యశోద సినిమాలో తన పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది సమంత. ఒక్క తెలుగులో మాత్రమే కాదు తమిళం కూడా తానే డబ్బింగ్ చెప్పుకుంది. హిందీ వర్షన్ కు మాత్రం చిన్మయి వాయిస్ ఓవర్ అందించింది. నవంబర్ 11న ప్యాన్ ఇండియా మార్కెట్ లో రిలీజ్ అవుతున్న యశోద మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది. ఈ సినిమా అన్ని భాషలకు సంబంధించిన రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దాదాపు 40 కోట్లకు కోనుగోలు చేసిందట.