హిట్ లేక అప్పుడే మూడు నెలలు గడిచిపోయింది
ఊర్వశివో రాక్షసివో అనుకున్న స్థాయిలో హిట్ అవుతుందా
ఆగస్ట్ 5న రిలీజైన బింబిసార, సితారామం చిత్రాలు అప్పటి వరకు వసూళ్ల లేక వెల వెలబోతున్న సినిమా పరిశ్రమకు సరికొత్త ఊపిరిలూదాయి. కాని ఈ మూవీ తర్వాత ఇండస్ట్రీ చాలా చిత్రాల విడుదలను చూసింది. కాని సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ రేంజ్ మూవీస్ చూడలేదు. అక్టోబర్ లో సిచ్యువేషన్ మరీ దారణం, మంచి చిత్రాలు బ్లాక్ బస్టర్ అవుతాయి అనుకున్న గాడ్ ఫాదర్, స్వాతి ముత్యం, ఓరి దేవుడా సినిమాలు భారీ వసూళ్లను అందుకోవడంలో విఫలం అయ్యాయి. ముఖ్యంగా చిరు సినిమా బంపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, ఆ స్థాయి వసూళ్లను అందుకోలేకపోయింది. ఇక స్వాతిముత్యం పరిస్థితి దారుణం. ఓరి దేవుడా కూడా బాక్సాఫీస్ దగ్గర ఎందుకో నిలబడలేకపోయింది. సెప్టెంబర్ లో రిలీజైన ఒకే ఒక జీవితం సిచ్యువేషన కూడా ఇదే. సినిమా బాగుంది అనే టాక్ వచ్చింది కాని భారీ విజయాన్ని మాత్రం అందుకోలేదు. నవంబర్ మొదటి వారంలో ఊర్వశివో రాక్షసివో, లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ రిలీజ్ అయ్యాయి. వీటితో పాటు మరో అరడజను చిన్న సినిమాలు విడుదల అయ్యాయి.వీటిల్లో గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఊర్వశివో రాక్షసివో సినిమా మాత్రమే సినిమా బాగుంది అనే టాక్ తెచ్చుకుంది. కాకపోతే అల్లు శిరీష్ అయినా వచ్చిన టాక్ ను వసూళ్ల రూపంలో మలుచుకుంటాడా లేక సెప్టెంబర్, అక్టోబర్ లో వచ్చిన హీరోల దారిలో వెళతాడా అనేది మరికొద్ది రోజులు ఆగితే తెల్సిపోతుంది.