అర్జున్‌కే ఫిటింగ్.. విశ్వక్ సేన్ మామూలోడు కాదు!
మొదట్నించీ అంతే.. ఆ హీరో అదో టైపు!
మా పల్లెలో గోపాలుడు టైంనుంచీ చూస్తున్నాం. సైలెంట్‌గా ఉండే సెలబ్రిటీ. ఎక్కడా వివాదాల్లో ఉండడు. తనవైపునుంచి అలాంటివాటికి ఆస్కారం ఇవ్వడు. కానీ అలాంటి వ్యక్తి కూడా మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేశాడంటే, ఓ హీరోమీద టాలీవుడ్ పెద్దలకు ఫిర్యాదు చేశాడంటే పాపం ఎంత బాధపడి ఉండాలి. ఎస్ మనం చెప్పుకునేది అర్జున్ గురించి. నాలుగుదశాబ్దాలుగా ఇండస్ట్రీతో అనుబంధమున్న అర్జున్‌ని ఇంతగా ఇరిటేట్ చేసిన హీరో మరెవరో కాదు విశ్వక్ సేన్. పెద్దగా విన్నట్లు లేదు కదూ. మరదే చేసిన నాలుగైదు సిన్మాలేక యాటిట్యూడ్‌తో తప్ప హీరోగా అంత పాపులారిటీ రాని కుర్రహీరోనే.
యంగ్ హీరో స్వయంకృషితో స్క్రీన్మీదికి వచ్చాడు. ఏదో ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో కాస్త నిలదొక్కుకుంటున్నాడు. కానీ యాటిట్యూడ్‌తోనే కోరి కష్టాలు కొనితెచ్చుకుంటున్నాడు. ఓసిన్మా ప్రమోషన్కోసం ట్రాఫిక్‌లో చీప్ పబ్లిసిటీతో ఓసారి అభాసుపాలయ్యాడు. ఓ టీవీ స్టూడియోలో ‘ఫ’ భాషతో మరోసారి వివాదాస్పదమై అందరితో చీవాట్లు తిన్నాడు. స్టేజీ ఎక్కాడంటే వాడెంత వీడెంత అంటాడు. మనోడంతేనని అందరూ సర్దుకుపోలేరుగా. చివరికి సీనియర్ హీరో అర్జున్‌ని కూడా ఇబ్బంది పెట్టి ఆడంతే అదో టైపు అనిపించుకుంటున్నాడు. హీరో విశ్వక్ సేన్‌తో స్వీయ దర్శకత్వంలో ఓ సిన్మా ప్లాన్ చేశాడు అర్జున్. హీరోయిన్ మరెవరో కాదు ఆయన కూతురు ఐశ్వర్య. కూతురి గ్రాండ్ ఎంట్రీకి మంచి ముహూర్తం పెట్టుకుని పవర్‌స్టార్‌తో క్లాప్ కొట్టించాడు. ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయ్యాక విశ్వక్ సేన్ త జాడించడం మొదలుపెట్టాడు. అగ్రిమెంట్ చేసుకున్నాక మొహం చాటేశాడు. దీంతో ఫిల్మ్ ఛాంబర్లో విశ్వక్ సేన్ మీద అర్జున్ ఫిర్యాదు చేశాడు. విశ్వక్ సేన్‌తో తనకెదురైన చేదు అనుభవాల్ని మీడియాకు చెప్పుకున్నాడు. గట్టి హిట్ పడకుండానే తలెగరేస్తున్న విశ్వక్సేనుడు దిగొస్తాడా.. డోంట్ కేర్ అంటాడా?