మళ్లీ భీష్మ కాంబినేషన్

By KTV Telugu On 6 November, 2022
image

హిట్ కోసమే అంటున్న యూత్ స్టార్
వెంకీని అగ్ర హీరోలు నమ్మడం లేదా?

ఛలో, భీష్మ చిత్రాల దర్శకుడు వెంకీ కుడుముల మూడో మూవీని మెగాస్టార్ తో ఫిక్స్ చేసుకున్నాడు. RRR ప్రొడ్యూసర్ దానయ్య ఈ సినిమా తెరకెక్కాల్సింది. కాని ఏం జరిగిందో ఏమో, ఈ మెగా మూవీ ఎనౌన్స్ మెంట్ దగ్గరే ఆగిపోయింది.
తర్వాత వెంకీ కుడుముల వెళ్లి బాలయ్యతో మూవీ చేయబోతున్నట్లు ప్రచారం సాగింది. కాని ఏది క్లారిటీలేదు.
ఈ దశలో వెంకీ కుడుమలతో మళ్లీ నితిన్ సినిమా చేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. మాచర్ల నియోజకవర్గం కూడా నిరుత్సాహ పరచడంతో భీష్మ దర్శకుడికి మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు. భీష్మ విజయం సాధించిన వెంటనే భీష్ 2 స్టోరీ లైన్ రెడీగా ఉందని గతంలోనే తెలిపాడు వెంకీ. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ తీస్తాడా లేక మరో కొత్త కథతో సినిమా తీస్తాడా అనేది కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.
మరో వైపు భీష్మ కాంబినేషన్ లో దర్శకుడు, హీరో మాత్రమే కాదు, హీరోయిన్ రష్మిక కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముందు ఛలో, ఆ తర్వాత భీష్మ ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ కు రష్మిక దగ్గరయ్యేలా చేసాడు వెంకీ. ఆ అనుబంధంతో మరోసారి ఈ దర్శకుడితో రష్మిక సినిమా చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.