హరీష్ శంకర్ పై మరో రూమర్
పవన్ తో సినిమా ఆగిపోయినట్లే
గద్దలకొండ గణేష్ తర్వాత హరీష్ శంకర్, పవన్ తో సినిమా కోసం, చాలా ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. పవన్ టైమ్ ఇస్తే, అత్యంత వేగంగా భవదీయుడు భగత్ సింగ్ పట్టాలెక్కిస్తానంటున్నాడు. కాని పవర్ స్టార్ కు అంత టైమ్ లేదు. రోజు రోజుకు పొలిటికల్ గా పవన్ యాక్టివ్ అవుతున్నాడు కాని, ఒకప్పటిలా షూటింగ్స్ కు డేట్స్ కేటాయించలేకపోతున్నాడు.
ఇప్పుడు కూడా తన చేతిలో ఉన్న హరి హర వీరమల్లు ను డిసెంబర్ తో పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో బస్సు యాత్ర చేపట్టాలి అనుకుంటున్నాడు. దాంతో హరీష్ తో చేయాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సినిమాను పవన్ 2024 ఎలక్షన్ తర్వాతే చేద్దాం అన్నాడట. చేసేది లేక హరీష్ కూడా మరో హీరోతో మూవీ చేయాలనుకుంటున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ దగ్గర బాలయ్యకు సంబంధించిన డేట్స్ ఉన్నాయి. పైగా వారి బ్యానర్ లోనే హరీష్ భవదీయుడు భగత్ సింగ్ చేయాల్సి ఉంది. అందుకే బాలయ్య డేట్స్ హరీష్ కు ఇప్పించే పనిలో ఉందట మైత్రీ మూవీ మేకర్స్. హరీష్ శంకర్, బాలయ్య కాంబినేషన్ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది.