ఇంట్లో తెలిసి పెళ్లికి ఒప్పుకున్న పెద్దలు
నవంబర్ 20న బెంగుళూరులో పెళ్లి
సినిమాల మీద సినిమాలు చేస్తూ ఉన్నాడు నాగశౌర్య. ఇంత బీజీ టైమ్ లో నాగశౌర్య ఎప్పుడు ప్రేమలో పడ్డాడు. ఆ రిలేషన్ ను పెళ్లి పీటల వరకు ఎప్పుడు తీసుకొచ్చాడు అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. టాలీవుడ్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లవ్ స్టోరీ ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది అనేది క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. మాజీ ప్రధాని దేవగౌడ కుటుంబానికి చెందిన అమ్మాయి అనూష శెట్టి బెంగుళూరులో ఇంటిరీయర్ డిజైనర్ గా వర్క్ చేస్తోంది. తనతో కొంతకాలంగా శౌర్య ప్రేమలో ఉన్నాడట. ఇంట్లో పెద్దలు కూడా వీరి ప్రేమకు అడ్డు చెప్పకపోవడంతో, ఇప్పుడు ఇద్దరు పెళ్లి పీటలెక్కుతున్నారట. నవంబర్ 20న బెంగుళూరులోని జే డబ్య్లూ మారియెట్ హోటెల్లో వీరిద్దరి వివాహం ఘనంగా జరగనుంది. నవంబర్ 19న ఘనంగా మెహిందీ ఫంక్షన్ జరగబోతోంది. నాగశౌర్య నటించిన చిత్రం కృష్ణా వృందా విహారి సినిమా ఇటీవలే ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ అందుకుంది.