లైగర్ సినిమాకు కవిత పెట్టుబడులు పెట్టారా?

By KTV Telugu On 19 November, 2022
image

పూరిని వదలని లైగర్ కష్టాలు
ఫెమా నిబంధనలు ఉల్లంఘించారంటూ విచారణ
దాదాపు 12 గంటల పాటు కొనసాగిన విచారణ

లైగర్ కు నిర్మాతలు ఎవరు? పూరి, చార్మి. కాని వీరిద్దరు కాదు, విదేశాల నుంచి వచ్చిన డబ్బుతోనే, వీరిద్దరు లైగర్ సినిమాను తెరకెక్కించారట. అంతే కాదు అదే డబ్బుతో జనగణమన ప్రారంభించారట. ఈ అక్రమ పెట్టుబడుల వెనుక ఒక రాజకీయ నేత ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్న వేళ టీఆర్ఎస్ నేత ఎమ్మల్సీ కవిత పెట్టుబడులు పెట్టారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరో వైపు లైగర్ సినిమా పెట్టుబడుల విషయంలో పూరి, చార్మి ఫెమా నిబంధనులు ఉల్లంఘించారనే అభియోగం పై ఈడీ అధికారులు తొలుత వీరిద్దరికి నోటీసులు జారీ చేసారు. నవంబర్ 17 ఉదయం 8 గంటలకు ఈడీ కార్యాలయాని పూరి,చార్మి చేరుకోగా అర్ధరాత్రి వరకు విచారణ కొనసాగింది. పూరి, చార్మి వేరువేరుగా విచారణ చేపట్టారు అధికారులు. అవసరమైతే మరో మారు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి పంపారు. ఈ సినిమా నిర్మాణంలో దుబాయ్ కి డబ్బులు పంపి అక్కడి నుంచి తిరిగి సినిమాకు పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారాలు గుర్తించినట్లు ప్రాధమిక సమాచారం. గత నెల 25న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు వరంగల్ శ్రీను, శోభన్ బాబు తనను వేధిస్తున్నారంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు పూరి.