గట్టిగా వినిపిస్తున్న రూమర్
శేఖర్ కమ్ములతో విజయ్ దేవరకొండ?
లైగర్ ఎఫెక్ట్ తో అనుకుంటా విజయ్ దేవరకొండలో మార్పు కనిపిస్తోంది. దర్శకుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తనని నటుడిగా నిలబెట్టే మూవీస్ మాత్రమే చేయాలి అనుకుంటున్నాడు. ముందుగా శివనిర్వాణ మేకింగ్ లో తెరకెక్కుతున్న ఖుషి ని రిలీజ్ చేయబోతున్నాడు. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కానుంది. అదే వరుసలో శేఖర్ కమ్ములతో మూవీ లాక్ చేసుకున్నాడని సమాచారం. లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్ కోసం కథను సిద్ధం చేస్తున్నాడు. పూర్తిగా పొలిటికల్ సబ్జెక్ట్ ఇది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో తెలంగాణ ప్రేమకథను తీస్తాడట. అన్ని కుదిరితే వచ్చే ఏడాది ఈ మూవీ పట్టాలెక్కనుంది. మరో వైపు విజయ్ కు ప్యాన్ ఇండియా నుంచి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా మలయాళంలో మోహన్ లాల్ నటించే న్యూ మూవీలో తనకు కొడుకు పాత్ర చేయమని రిక్వెస్ట్ వచ్చిందట. మోహన్ లాల్, విజయ్ దేవరకొండ కలసి కనిపిస్తే ఆ ప్రాజెక్ట్ ఇటు టాలీవుడ్ లో, అటు మాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ గా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.