ఆ సినిమాను పక్కన పెట్టాడా?
ఒకే ఒక జీవితం హిట్ తోనే ఆ నిర్ణయం?
ఆ మధ్య ఛల్ మోహన్ రంగా, రౌడీ ఫెల్లో చిత్రాలు తీసిన దర్శకుడు కృష్ణ చైతన్య మేకింగ్ లో ఒక సినిమా ఎనౌన్స్ చేసాడు శర్వానంద్. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించాల్సిన చిత్రమిది. కాని సినిమాను ఘునంగా ప్రారంభించిన తర్వాత
శర్వానంద్ ఎందుకో పక్కన పెట్టాడు. ఆరు ఫ్లాపుల తర్వాత ఒకే ఒక జీవితం చిత్రంతో హిట్ అందుకున్నాడు శర్వా.
సక్సెస్ ను కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడు. అయితే కృష్ణ చైతన్య పై నమ్మకం లేక మరో యంగ్ డైరెక్టర్ తో మూవీ కమిట్ అయ్యాడట. భలే మంచి రోజు, శమంతకమణి సినిమాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రాసుకొచ్చిన స్టోరీలైన్ శర్వానంద్ కు బాగా నచ్చిందట. అందుకే కెరీర్ లో బిగ్ హిట్ లేని ఈ యంగ్ డైరెక్టర్ కు గోల్డెన్ ఆఫర్ ఇచ్చాడు శర్వానంద్. పైగా ఈ మూవీలో రాశి ఖన్నాను పక్కనపెట్టి, ఉప్పెన ఫేమ్ కృతికి అవకాశం ఇస్తున్నాడట.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని భారీ ఎత్తున నిర్మించబోతోంది. శ్రీరామ్ ఆదిత్య అంటే క్రైమ్ కామెడీ కి కేరాఫ్ అడ్రస్. మరి శర్వానంద్ తో ఎలాంటి క్రైమ్ కామెడీ మూవీ తెరకెక్కిస్తాడో చూడాలి.