పోటుగాడన్నారు.. కెప్టెన్సీ ఇవ్వాలన్నారు
ఆశాకిరణమని ఛాన్స్ ఇస్తే నిరాశే మిగిల్చాడు
ఓపెనర్‌గా వచ్చినా.. వన్‌డౌన్‌లో వచ్చినా
అదే ఆట తీరు.. అవే చెత్తషాట్లు
పంత్‌పై సెలెక్టర్లకి ఎందుకంత ప్రేమ
శాంసన్‌పై చిన్నచూపు ఏల.
అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు అన్నట్ట రిషబ్ పంత్ టీమిండియాకు ఆశాకిరణం అన్నారు. అతన్ని కెప్టెన్ చేయాలని చాలా మంది లెక్చర్లు ఇచ్చారు. పంత్ పోటుగాడంటున్నారని సెలెక్టర్లు కూడా ఎవరికీ ఇవ్వనన్ని ఛాన్స్‌లు అతనికి ఇచ్చారు. అంతకన్నా మంచి ఆటగాళ్లున్నా వారిని బెంచ్‌కే పరిమితం చేశారు. కానీ ఏం లాభం. ప్రతీసారి తనపై పెట్టుకున్న నమ్ముకాన్ని వమ్ము చేస్తూ నిరాశే మిగిల్చాడు. ఓపెనర్‌గా వచ్చినా, వన్‌డౌన్‌లో వచ్చినా అంతా డౌనే. అదే ఆటతీరు. అవే చెత్త షాట్లు. మొన్న వరల్డ్ కప్‌లోనూ, ఇప్పుడు న్యూజిలాండ్ టూర్‌లోనూ పంత్ వరుస ఫెయిల్యూర్స్ మూటగట్టుకున్నాడు. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పంత్ ఇక మారవా ఇంకా ఎన్ని ఛాన్స్ లివ్వాలంటూ.. పొగిడిన నోళ్లు కూడా ఇప్పుడు తిడుతున్నాయి.
టీమిండియా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అండ్ వైస్ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ న్యూజిలాండ్‌తో జరిగిన టీ 20 సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఓపెనర్‌గా అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేక మరోసారి చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. పంత్ ఇక మారవా..? అంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పంత్‌ను తప్పించి సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పంత్‌కు ఇచ్చినన్ని అవకాశాలు భారత క్రికెట్ చరిత్రలో ఎవరికీ ఇవ్వలేదని బీసీసీఐకి, సెలెక్టర్లకు పంత్‌పై ఎందుకు ఇంత ప్రేమ అని ప్రశ్నిస్తున్నారు. ఫామ్‌లో ఉన్న శాంసన్‌ను పక్కకు పెట్టి పంత్‌కు వరుస అవకాశాలు ఇవ్వడమేంటని నిలదీస్తున్నారు. ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే సైతం పంత్ ఎలాంటి ఆటగాడు కావాలనుకుంటున్నాడో అర్థం కావడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
పంత్‌కు ఇచ్చినన్ని అవకాశాలు శాంసన్‌కు ఇచ్చి ఉంటే ఈపాటికి స్టార్ ప్లేయర్‌గా ఎదిగేవాడని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి గణాంకాలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ ట్రోలింగ్‌కు దిగుతున్నారు. శాంసన్ 2015లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేస్తే ఇప్పటివరకు ఆడింది కేవలం 16 మ్యాచ్‌లే. వన్డేల్లో, టెస్ట్‌ల్లో కూడా శాంసన్‌కు అన్యాయం జరిగిందని అతని అభిమానులు వాపోతున్నారు. 2017లో పొట్టి క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పంత్ ఏకంగా 65 టీ20లు ఆడాడు. 27 వన్డేలు, 31 టెస్ట్‌ల్లో ఛాన్స్ లభించింది. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్లైన ఈ ఇద్దరు క్రికెటర్లు ప్రతిభావంతులే అయినప్పటికీ బీసీసీఐ శాంసన్‌తో పోలిస్తే పంత్‌ను ఎక్కువగా ప్రోత్సహించి అవకాశాలిచ్చి తీవ్ర విమర్శలు మూటగట్టుంది. వన్డే సిరీస్‌లోనైనా పంత్‌ను పక్కనపెట్టి సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు.