రంగంలోకి కార్తికేయ -2 రైటర్
ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలను విడదల చేసాడు రవితేజ. ఒకటి ఖిలాడి, మరొకటి రామారావు ఆన్ డ్యూటీ.
రెండూ కూడా మాస్ రాజాకు పెద్దగా కలసిరాలేదు. అందుకే ధమాకా మూవీతో హిట్ కొట్టి 2022కి గుడ్ బై చెప్పాలనుకుంటున్నాడు. గతంలో సినిమా చూపిస్త మావ, హలో గురు ప్రేమ కోసమే చిత్రాలను తెరకెక్కించిన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మాస్ రాజా కోసమే రెడీ చేసినస్టోరీ ఇది. అందుకు తగ్గట్లే రవితేజ ఎనర్జీ ఎక్కడా తగ్గకుండా నటించాడు. ధమాకా టైటిల్ కు జెస్టిఫై చేసాడు. డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా మూవీ రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
అందులో భాగంగా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తైంది. అయితే ఇటీవల రఫ్ కట్ చూసిన రవితేజ, సినిమాపై అసహనం వ్యక్తం చేసాడట. వెంటనే కార్తికేయ -2 రైటర్ ను పిలిపించి, కొన్ని సీన్స్ మళ్లీ రాయించుకున్నాడట. ఆ సీన్స్ కూడా ఇటీవల రీషూట్ చేసారట. ఇప్పుడు ధమాకా సినిమా సక్సెస్ పై రవితేజ కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. డిసెంబర్ మొదటి వారం నుంచి మాస్ రాజా ధమాకాను భారీ ఎత్తున ప్రమోట్ చేయనున్నాడు.