RRR సీక్వెల్ కు స్టోరీ రెడీ

By KTV Telugu On 25 November, 2022
image

దూసుకుపోతున్న స్టార్ రైటర్
రాజమౌళి చేతిలో రెండు చిత్రాలు

దర్శకధీరుడిని హాలీవుడ్ కు చేరువ చేసిన RRRపై,
రాజమౌళి ప్రత్యేకమైన అభిమానాన్ని పెంచుకున్నాడా
అందుకే RRRకు అర్జెంటుగా సీక్వెల్ రెడీ కావాలనుకుంటున్నాడా..
సో దట్ హాలీవుడ్ మార్కెట్ ను కొల్లగొట్ట వచ్చు అని,
జక్కన్న డిసైడ్ అయ్యాడా ఎందుకింత స్పీడ్ గా RRR-2కు స్టోరీ రాయిస్తున్నాడు.
స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ స్పీడ్ గురించి తెల్సిందే.
ఆయన దగ్గర కథా నిధి ఉంది.
ఇప్పుడు ఆ నిధిలోకి RRR సీక్వెల్ స్టోరీ కూడా చేరిపోయింది.
RRR 2 ఎలా ఉండాలి అనే విషయం పై ఓట్ లైన్ స్టోరీ లాక్ అయిపోయిందట.
కాని ఏం లాభం ఇప్పుడు జక్కన్న మహేష్ తో మూవీ కంప్లీట్ చేయాలి.
ఈ సినిమాను ఇండియానా జోన్స్ మరిపించే విధంగా తెరకెక్కించాలి.
అందుకోసం చాలా ఏళ్లు సమయం పట్టనుంది.
మరోవైపు RRR సీక్వెల్ కు స్టోరీ ఫిక్స్ అంటే,
రామ్ చరణ్, తారక్ డేట్స్ అందుబాటులో ఉంచుకోవాలి,
తమ కెరీర్ లో మళ్లీ ముడేళ్ల సమయాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది.