గతంలో హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
హైకోర్టు ఆదేశాలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సుప్రీం ధర్మాసనం
అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా? అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా? హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా? ఆరు నెలల్లో నిర్మాణం చేయాలంటారా? మీరే ప్రభుత్వమైతే అక్కడ కేబినెట్ ఎందుకు? అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కదా? హైకోర్టు ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించింది’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజధాని ఇదే ప్రాంతంలో ఉండాలని ఒక రాష్ట్రాన్ని ఆదేశించలేం. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్రానికి చెప్పలేం అని సుప్రీం పేర్కొంది. టీడీపీ హయాంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. గ్రాఫిక్స్‌లో మరో కొత్త ప్రపంచాన్ని చూపించి ఊరించిన రాజధాని. కానీ ఇప్పుడా అమరావతి కేవలం శాసనరాజధాని. వైసీపీ ప్రభుత్వ పాలనా వ్యవహారాలకు తాత్కాలిక రాజధాని. మట్టి, నీళ్లతో వచ్చి అమరావతికి శంకుస్థాపన చేసిన మోడీ ప్రధానిగా ఉన్నా ఏపీ రాజధాని త్రిశంకుస్వర్గంలోనే ఉంది.
మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం ఫుల్ క్లారిటీతో ఉంది. అమరావతి రైతుల పాదయాత్ర కంఠశోఠగానే మిగిలింది. వికేంద్రీకరణకు మద్దతుగా సీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోటాపోటీ కార్యక్రమాలతో రాజధాని అంశం మరింత వివాదాస్పదమైంది. న్యాయపోరాటంలో తామే నెగ్గుతామని అమరావతి రైతులు ధీమాగా ఉన్నా సుప్రీం తీర్పు వారిని నిరాశపరిచింది. అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా? అని సుప్రీం ప్రశ్నించింది. అంతేకాదు రాజధాని విషయంలో హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందని సుప్రీంకోర్టు కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించింది. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలాగంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం పరోక్షంగా సమర్థించింది. టీడీపీ వాదనను సమర్ధిస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న బీజేపీ కూడా సుప్రీం తీర్పుతో ఖంగుతింది. సుప్రీం తాజా తీర్పుతో మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం మరింత ఉత్సాహంగా ఉంది.