టిల్లు స్క్వేర్ కు మరో షాక్

By KTV Telugu On 29 November, 2022
image

తప్పుకున్న అనుపమ పరమేశ్వరన్
ఛాన్స్ కొట్టేసిన మడోన్న సెబాస్టియన్

2023 మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఒకటి డీజే టిల్లు సీక్వెల్.
సీక్వెల్ కు టిల్లూ స్క్వేర్ అనే పేరు పెట్టారు.
మొదటి భాగంలో కనిపించిన నేహా శెట్టి,
రెండవ భాగంలో నటించడం లేదు.
మొదటి భాగం డైరెక్ట్ చేసిన విమల్ కృష్ణ తప్పుకున్నాడు.
సీక్వెల్ కు వీరిద్దరు ఎందుకు తప్పుకున్నారు అంటే,
హీరో సిద్ధూ జొన్నలగడ్డ దగ్గర సమాధానం లేదు.
ఏ రీజన్ వల్ల వీరిద్దరు తప్పుకున్నారో కాని,
ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి అదే వెళ్లిపోతున్నారు మిగితా యాక్టర్స్.
ముఖ్యంగా టిల్లుకు జోడి కుదరడం లేదు.
మొదట పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల పేరును ఖరారు చేసారు.
ఆమె 5 రోజుల షూటింగ్ తర్వాత తప్పుకుంది.
ఆ తర్వాత కార్తికేయ2తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ అడుగు పెట్టింది.
కొద్దిరోజులు షూటింగ్ గడిచిందో లేదో,
ఆమే స్థానంలో మరో కథానాయిక మడోనా సెబాస్టియన్ వచ్చింది.
టిల్లు స్క్వేర్ హీరోయిన్స్ ఎందుకు ఫిక్స్ కావడంలేదు అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
సినిమాలో సీన్స్, డైలాగ్స్ విషయంలో ఏదైనా ఇబ్బంది పడుతున్నారా అనుమానం కలుగుతోంది.
మార్చిలో ఈ మూవీని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.