సాయి పల్లవి సంచలన నిర్ణయం

By KTV Telugu On 29 November, 2022
image

ఈ ఏడాది సాయి పల్లవి నటించిన చిత్రాలు,రెండే రెండు అవి విరాటపర్వం, గార్గి.
అయితే గార్గి రిలీజ్ తర్వాత సాయిపల్లవి కొత్త సినిమాలు ఒప్పుకోకపోవడం, చేతిలో ఉన్న ఒక్క తమిళ చిత్రం ఇంకా ప్రారంభం కాకపోవడంతో లేడీ పవర్ స్టార్ సినిమాలకు దూరం అవుతోందనే రూమర్ షికారు చేయడం ప్రారంభం అయింది. పుష్ప-2లో సాయి సాయిపల్లవి నటించనుందని ప్రచారం సాగినప్పటికీ సాయిపల్లవి నుంచి కాని, సుకుమార్ నుంచి కాని క్లారిటీ లేకపోవడంతో  ఈ కన్ ఫ్యూజన్ ఇంకా కంటిన్యూ అవుతోంది. దక్షిదాది లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవికి నార్త్ లో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హిందీ, మరాఠీ సినిమాల్లో నటించమని ఆఫర్స్ వచ్చాయి. కాని లేడీ పవర్ స్టార్ మాత్రం టాలీవుడ్ నుంచే కాదు ఏ ఇండస్ట్రీ నుంచి ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేస్తూ వెళ్తోంది. సాయి పల్లవి తిరిగి డాక్టర్ గా ప్రాక్టీస్ ప్రారంభించబోతోందని సొంతరూలో ఆసుపత్రిని కడుతోందని అందుకే సినిమాలకు దూరం కానుందని ప్రస్తుతం రూమర్స్ ఇండియా అంతటా చెక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల ప్యాన్ ఇండియా చిత్రాన్ని ప్రారంభించాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుందని ప్రచారం సాగుతోంది. ఫిదాతో తెలుగు తెరకు పరిచయం చేసాడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు ధనుష్ చిత్రంతో పల్లవిని పాన్ ఇండియా ఆడియెన్స్ కు ఇంట్రడ్యూస్ చేయనున్నాడనే టాక్ కూడా ఉంది.