వార్ వన్ సైడ్ కావాలంటే ఏం చేయాలి?

By KTV Telugu On 4 May, 2022
image

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రధాన సవాళ్లు ఏంటి ? ప్రజలను కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఎలా నమ్మకం కల్పించాలి ? బీజేపీని సైడ్ చేసి టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం ఎలా నిరూపించాలి ? యువతను ఆకర్షించేందుకు…ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలి ? నిరుద్యోగ సమస్యకు ఎలా పరిష్కారం చూపించాలి ? కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ…రాష్ట్రంలో పార్టీ విజయానికి దారి చూపిస్తారా ? అసలు కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్న ఐదు ప్రధాన సవాళ్లను ఇపుడు చూద్దాం.

వార్ వన్ సైడ్ కావడానికి ప్లాన్ కావాలి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఏమేం కావాలో అన్ని ఉన్నాయ్. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కేడర్ ఉంది. సాంప్రదాయబద్దంగా వస్తున్న ఓటర్లు పార్టీని నమ్ముకునే ఉన్నారు. ఓటర్లను చైతన్యం చేయడంలో కాంగ్రెస్ పార్టీ నేతలు విఫలమవుతున్నారు. రెండు సార్లు అధికారంలోకి కోల్పోయిన హస్తం పార్టీ మూడోసారి ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. రేసులో తామే విజయం సాధిస్తామనేలా కార్యక్రమాలు చేపట్టాలి.

టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ ను సైడ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచించాలి. అధికార పార్టీకి బీజేపీ ప్రత్యామ్నాయం కాదని చెప్పడానికి. వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం హస్తం పార్టీకి ఎంతైనా ఉంది.తెలంగాణలో లక్షలాది మంది ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతో మందికి చదువు తగ్గ ఉపాధి దొరక్క చిన్న చిన్న ఉద్యోగాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. యువత, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి దారి చూపించాలి.

సమస్యలను ఎత్తి చూపాలి
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో రాష్ట్రంలో నీటి సౌలభ్యం పెరిగింది. కాళేశ్వరం, మల్లన్నసాగర్ వంటి నీటి ప్రాజెక్టులతో సాగు విస్తీర్ణం పెరిగింది. అయితే పండించిన పంటను ఎలా కొనుగోలు చేయడానికి గులాబీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు. అటు తెలంగాణ ప్రభుత్వంపై ఉద్యోగులు అంతర్గతంగా రగిలిపోతున్నారు. పీఆర్సీ, సకాలంలో జీతాలు అందకపోవడం, సంఘాల నేతలకు ప్రాధాన్యత కల్పించడం వంటి అంశాల్లో కారు పార్టీపై గుర్రుగా ఉన్నారు.

ఈ ఐదు అంశాలపై పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇస్తే హస్తం పార్టీకి మైలేజ్ రావడం పెద్ద విషయమేమీ కాదు. ప్రత్యర్థులు వైఫల్యాలను ఎత్తిచూపుతూనే తాము చేయాలనుకున్నది విస్పష్టంగా వివరించాలి. పార్టీ శ్రేణులు ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ… నేనున్నా అనేలా కార్యకర్తలకు, ప్రజలకు భరోసా కల్పించాలి. అప్పుడే కాంగ్రెస్ కి విజయం సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది.