హీరో భార్యపై అసభ్యకరమైన పోస్టులు

By KTV Telugu On 1 December, 2022
image

తట్టుకోలేకపోతున్నాను అంటున్న హీరోయిన్
త్వరలో వెయిట్ తగ్గుతానుంటూ ప్రామిస్

తమిళ నటుడు గౌతమ్ కార్తిక్, మలయాళ నటి మంజిమ మోహన్ ఇటీవలే పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే.
నవంబర్ 28న మంజిమ మెడలో మూడు ముళ్లు వేసాడు కార్తిక్. గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట
ఇటీవలే చెన్నైలో వివాహ వేడుకలో ఒక్కటయ్యారు. మ్యారేజ్ తర్వాత ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మంజిమ
తనకు జరిగిన బాడీ షేమింగ్ గురించి చెప్పుకొచ్చింది. గౌతమ్ తో రిలేషన్ ఎనౌన్స్ మెంట్ జరిగినప్పటి నుంచి
తన వెయిట్ పై కామెంట్స్ చూస్తూ వస్తున్నానని అయినా తన వెయిట్ గురించి తనకు లేని బాధ మరొకరికి ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. త్వరలోనే తిరిగి నార్మల్ వెయిట్ లో కనిపిస్తానని అంతవరకు ఓపిక పట్టమంటూ తనపై బాడీ షేమింగ్ కు పాల్పడినవారికి చురకలు పెట్టింది. గతంలో రామ్ చరణ్ భార్య ఉపాసనపై ఇలాంటి కామెంట్స్ వినిపించాయి. కాని ఇప్పుడు ఉపాసన లుక్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఉంది. పైగా తనదైన ప్రతిభతో వివిధ రంగాల్లో దూసుకుపోతోంది. త్వరలో మంజిమ కూడా విమర్శకులకు షాక్ ఇవ్వడం ఖాయం.