డిస్ట్రీబ్యూటర్స్ వర్సెస్ ఎగ్జిబీటర్స్
కొనసాగుతున్న చర్చలు
డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతోంది అవతార్ -2. జేమ్స్ కామెరూన్ 13 ఏళ్ల పాటు శ్రమించి నిర్మించిన చిత్రమిది. ఈ సినిమాకు హాలీవుడ్ లోనే కాదు మాలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంది. అందుకే వ్యాపారం సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. సినిమా విడుదల తర్వాత లాభాలు పంచుకునే విషయంలో ఏర్పడిన వివాదంతో కేరళలో అవతార్ -2 ప్రదర్శించకూడదని ఎగ్జిబీటర్లు నిర్ణయం తీసుకున్నారు. కొత్త సినిమా విడుదలైతే
50 శాతం షేర్ ఇస్తారు. కాని అవతార్ -2కు ఉన్న క్రేజ్ కారణంగా 60 శాతం అడుగుతున్నారు డిస్ట్రిబ్యూటర్స్. దాంతో ఎగ్జిబీటర్లు ససేమిరా అన్నారు. అంతే కాదు 55 శాతం వరకు ఇస్తామని ఒక మెట్టుకూడా దిగారు. కాని డిస్ట్రీబ్యూటర్లు 60 శాతం పైనే పట్టుబట్టడంతో కేరళలోని 400 స్క్రీన్స్ లో డిసెంబర్ 16న అవతార్ -2 ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నారు అక్కడి థియేటర్ యజమానులు. ప్రస్తుతం డిస్ట్రీబ్యూటర్లకు, ఎగ్జిబీటర్లకు మధ్య చర్చలు జరుగుతున్నాయి.