రణవీర్ సింగ్ తోనే బాహుబలి లాంటి ప్రాజెక్ట్

By KTV Telugu On 2 December, 2022
image

శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కనుందా?
కాని కోలీవుడ్ లో ఊరుకుంటారా?

ఇండియాలోనే బెస్ట్ డైరెక్టర్స్ లో ఒకడు శంకర్. ప్రస్తుతం భారతీయుడు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు.
మరో వైపు రామ్ చరణ్ తో అతని కెరీర్ లో 15వ సినిమా తీస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత తమిళ నవల వేల్పరి నవల ఆధారంగా చేసుకుని మూడు భాగాలుగా చిత్రాలు తెరకెక్కించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ను అనుకుంటున్నాడు. రణవీర్ తో అపరిచితుడు రీమేక్ చేయాలి అనుకున్నాడు శంకర్. కాని రీమేక్ రైట్స్ దక్కలేదు. దాంతో వేల్పరి నవలను వెండితెరకెక్కించే బాధ్యతను అందుకున్నాడు. వచ్చే ఏడాది జూన్ లేదా జులైలో
ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ లోపు శంకర్ చేతిలో ఉన్న కమల్, రామ్ చరణ్ చిత్రాలు పూర్తి కానున్నాయి.
మరో వైపు రణవీర్ సింగ్ తన చేతిలో ఉన్న బాలీవుడ్ సినిమాలను కంప్లీట్ చేయనున్నాడు. గతంలో ఇదే ప్రాజెక్ట్ కోసం సూర్యను సంప్రదించాడు శంకర్. ఇఫ్పుడు సూర్యను మరో తమిళ హీరోను కాదని
తమిళ నవలను ఓ ఉత్తరాది హీరోతో తెరకెక్కిస్తే తమిళ ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు అనేది ఆశక్తికరంగా మారింది.