రైతుల పేరుతో యాత్రలో పాల్గొన్నది రైతులు కారా ?
గుర్తింపు కార్డులు అడగ్గానే యాత్ర ఎందుకు రద్దైంది ?
అమరావతి నుంచి అరసవల్లికి చేపట్టిన యాత్రతో ప్రభుత్వంపై వత్తిడి పెంచాలని అనుకున్నారు చంద్రబాబు నాయుడు. హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని మరీ యాత్ర కొనసాగిస్తున్నారు. ఆయన ప్లాన్ చేసిన విధంగానే ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేందుకు ఆ యాత్రలో పాల్గొన్న టీడీపీ నాయకులు రకరకాల ప్రయత్నాలు చేశారు. తొడలు కొడుతూ, మీసాలు మెలేస్తూ, మంత్రులను, ముఖ్యమంత్రిని బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఇన్నిరోజులు సాఫీగానే సాగిన ఆ యాత్రకు ఉత్తరాంధ్రలో ప్రతిఘటన ఎదురవుతోంది. మూడు రాజధానులకు మద్దతుగా అమరావతికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అడుగడుగునా ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో యాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలి, రెండు వాహనాలు మాత్రమే ఉండాలి. సంఘీభావం తెలపడానికి వచ్చిన వాళ్లు రోడ్డుకు ఇరువైపులా నిలుచోవాలి తప్ప యాత్రలో పాల్గొనకూడదు అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. ఆ ఆదేశాలను పాటించండి అని చెప్పిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు యాత్రికులు. అయితే కోర్టు చెప్పినవిధంగా యాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని, వారి గుర్తింపు కార్డులు చూపించాలని పోలీసులు చెప్పడంతో సడెన్గా యాత్రను వాయిదా వేసుకుని అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. ఇన్ని రోజులు జోరుగా సాగిన యాత్ర ఉన్నట్లుండి ఎందుకు ఆగిపోయిందో ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు ఆ యాత్రలో అమరావతి రైతులు లేరని అందుకే గుర్తింపు కార్డులు చూపించమని అడగ్గానే అందరూ జారుకున్నారని అనుకుంటున్నారు. మరి ఇన్ని రోజులు అమరావతి యాత్ర చేసిందెవరు ? రైతుల ముసుగులో టీడీపీ తన సామాజిక వర్గ నేతల అండదండలతో చేయించిందా ? లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులతో నడిపించిందా ? నిజంగా వాళ్లందరూ అమరావతి రైతులే అయితే వాయిదా వేసుకునే వెళ్లే అవసరం ఏముంది ? అమరావతి యాత్ర ఇప్పట్లో మొదలు కాకపోతే మాత్రం రాష్ట్రంలోని మిగతా ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఇన్ని రోజులు వైసీపీ చెపుతున్నట్లు ఆ యాత్రలో ఉన్నది కేవలం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నాయకులే అనుకోవడంలో తప్పులేదు.