జనసేన ప్రధాన ఎజెండా ప్రభుత్వాన్ని ప్రశ్నించటడమే. ఐతే జనసేనానినే ఇప్పుడు అనేక ప్రశ్నలు వేధిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ ఎటువైపు మొగ్గు చూపుతారు? అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కు మద్దతు పలికారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు కలసి నడుస్తాం అని ఇరు పక్షాల నాయకులు చెప్పుకొచ్చారు. అప్పుడు జనసేన,టీటీడీ పొత్తు ఖాయమని అందరూ భావించారు. కానీ మోదీ, పవన్ భేటీ తర్వాత ఆ పొలిటికల్ సీన్ రివర్సైంది.
భేటీ తర్వాత ప్రధాని మోదీపై పవన్ ప్రశంసల జల్లు కురిపంచారు. ఏపీ రాజకీయ ముఖచిత్రం మారబోతుందని పెద్ద స్టేట్ మెంటే ఇచ్చారు. కానీ ఆ రాజకీయ భేటీలో ఏం చర్చించుకున్నారు అనేది మాత్రం అనే దానిపై ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. గమనించాల్సింది ఏమిటంటే మోదీ భేటీ తర్వాత టీటీపీ శ్రేణులు కూడా కామ్ అయిపోయాయి. పవన్ ఊసే ఎత్తటం లేదు. పవన్ కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. పవన్ ని బిజేపీ నాయకులు లైట్ తీసుకుంటున్నారు అని అధికార పక్షం చెబుతుంది కానీ మోదీ, పవన్ భేటీలో దాగున్న మర్మమేంటో రాబోయే రోజుల్లో తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.