నా రసగుల్లా.. పట్టాభిని ఆటాడుకున్న ఆర్జీవీ

By KTV Telugu On 30 October, 2022
image

జగన్, వర్మ భేటీపై టీడీపీ నేత పట్టాభి ఫైర్.
ఆర్జీవిని ప్లాప్ డైరెక్టర్ తో పోల్చిన పట్టాభి.
పట్టాభిని రసగుల్లగా అభివర్ణించిన వర్మ.
ముద్దుగా బొద్దుగా ఉన్నావంటూ సెటైర్లు.
స్వీటూ టెన్షన్ పడితే చస్తావ్ అంటూ పంచులు.

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సీఎం జగన్ తో భేటీ ఏపీలో రాజకీయ వేడి రాజేస్తోంది. జగన్, వర్మ రహస్య భేటీపై ప్రతిపక్ష నేతల విమర్శలతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. టీడీపీ నేత పట్టాభి… వర్మను ఓ ప్లాప్ డైరెక్టర్ తో పోల్చుతూ ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. పట్టాభి కామెంట్స్ ను వైసీపీ నేతలు లైట్ తీసుకున్నా, వర్మ మాత్రం వదల్లేదు. అతనిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ….ఆర్టీవీ ఏకంగా ఓ ఆడియో విడుదల చేశారు. అది వైరల్ కావడంతో పొలిటికల్ సినిమా మరింత రక్తికడుతోంది. పట్టాభిని ఓ రసగుల్లగా అభివర్ణించిన వర్మ…ముద్దుగా, బొద్దుగా ఉంటాడంటూ సెటైర్లు పేల్చారు. అంతేకాదు, పట్టాభి బామా, భీమానో తెలియదంటూనే…రామ్ అనుకుంటా అంటూ తన నోటికి పనిజెప్పారు. తాను జగన్ తో భేటీ అయితే… మీ పార్టీ వాళ్లందరినీ ఎందుకు భయపెడుతున్నావ్ పట్టాభి అంటూ వర్మ పంచులు విసిరారు. జగన్ ను ఎందుకు కలిశానో తెలియకుండా అలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.

పట్టాభి తనను ప్లాప్ డైరెక్టర్ గా పోల్చడంతో వర్మకు కాలినట్టుంది. అంతే, ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.
తాను బ్యాడ్ డైరెక్టర్, బ్యాడ్ సినిమా తీస్తానని అనుకుంటున్నప్పుడు హ్యాపీగా ఉండాలి కానీ టెన్షన్ ఎందుకని పట్టాభిని వర్మ ప్రశ్నించారు. రసగుల్లాలా చక్కెరలోనో, బెల్లంలోనో కూర్చుకుండా అంత హైరానా పడితే షుగర్, బీపీ ఎక్కువై చస్తావంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రసగుల్లా రసగుల్లాలా ఉండాలని, మిరపకాయలా యాక్ట్ చేయకూడదంటూ సెటైర్లు వేశారు వర్మ. పట్టాభిని చూస్తే జాలేస్తోందని…బుగ్గ గిల్లాలనిపిస్తోందంటూ ఆడియోలో రెచ్చిపోయారు ఆర్జీవీ. నాకు స్వీట్స్ అంటే ఇష్టం. రసగుల్లా తర్వాత నీలా బొద్దుగా ముద్దుగా ఉన్న పదార్ధం నేను చూడలేదు. కాబట్టి స్వీటూ… ఇంకో రెండు రసగుల్లాలు తిని ఇంట్లో కూర్చో అని సలహా ఇచ్చారు వర్మ. నీ అవసరం నీ ఇంట్లో వాళ్లకు తప్ప ఇంకెవరికీ లేదనుకుంటున్నా…ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అంటూ వర్మ పట్టాభిపై చెలరేగిపోయారు.

ఇటీవల ముఖ్యమంత్రిని సీక్రెట్ గా కలిసిన వర్మ, వైసీపీ కోసం ఓ రెండు సినిమాలు ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వ్యూహం, శపథం పేర్లతో రెండు పార్ట్ లు ఉంటుందని ఆర్జీవీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చారు. సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్న వర్మ, అది ఎవరి గురించి అనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టారు. అయితే, ఈ రెండు పార్ట్ లు జగన్ బయోపిక్ అనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రతిపక్ష టీడీపీ జగన్, వర్మ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆఖరికి నాలుగు ఓట్ల కోసం వర్మతో సినిమా తీయించుకునే స్థాయికి సీఎం దిగజారాడంటూ పట్టాభి తీవ్ర విమర్శలు చేశారు. వర్మ ఓ ప్లాప్ డైరెక్టర్ అని, జగన్ బయోపిక్ కూడా ప్లాప్ అవుతుందని పట్టాభి ఫైర్ అయ్యారు. అంతేస్పీడ్ లో మసాలా జోడించ్ వర్మ రివర్స్ పైర్ అవడంతో ఈ సినిమా ఇంతటితో ఆగదని తెలుస్తోంది. వర్మ కామెంట్స్ పై పట్టాభి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.