ఎవరు ఈ పెమ్మసాని -Pemmasani Chandra Shekar

By KTV Telugu On 25 April, 2024
image

KTV TELUGU :-

దేశంలో చాలా మంది పారిశ్రామికవేత్తలు ఎన్నికల బరిలోకి దిగి ఉంటారు కానీ.. వారెవరూ తమ ఆస్తుల్ని వేల కోట్లలో చూపించలేదు. చాలా తక్కువే చూపిస్తారు. కానీ అమెరికాలో మెడికల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్న గుంటూరు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాత్రం .. తన ఆస్తుల్ని   ప్రకటించారు. తన కు.. తన కుటుంబానికి మొత్తంగా 5700 కోట్ల వరకూ ఆస్తులున్నట్లుగా ప్రకటించారు. ఆయన దేశంలోనే అత్యంత రిచ్చెస్ట్ అభ్యర్థి కేటగిరిలోకి రావొచ్చు. కానీ ఆయన పేరు ఎప్పుడూ  దేశంలో ప్రజలు విని ఉండరు. ఇంతకీ ఎవరు ఈయన. అంత డబ్బు ఎలా సంపాదించారు ?

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తాను ఈ సారి పోటీ చేయలేనని ఎన్నికల నుంచి వైదొలిగారు. ఆ తర్వాత గుంటూరు అభ్యర్థి ఎవరు అన్న చర్చ వచ్చినప్పుడు చాలా పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. కానీ అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు పెమ్మసాని చంద్రశేఖర్. ఎన్నికల్లో నామినేషన్ తర్వాత ఆయన అఫిడవిట్ గురించి జరుగుతున్న  ప్రచారంతో ఆయన నేషనల్ వైట్ హాట్ టాపిక్ అయ్యారు.

నిన్నామొన్నటి వరకూ పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరో  టీడీపీలోని ముఖ్యులకు కూడా ఎవరికీ తెలియదు. నిజంగా ఆయనను చూసిన వారు కూడా తక్కువే.   రాజకీయ వేధింపుల వల్ల తన వ్యాపారాలకు ఇబ్బంది అవుతుందని కొన్నాళ్లు విరామం ప్రకటించారు గల్లా జయదేవ్. ఆయనే పోటీ చేస్తానంటే కొత్త అభ్యర్థిని చూడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ గల్లా జయదేవ్ వైదొలగడంతో టీడీపీలో ఇతరులకు చాన్స్ రావడం ఖాయమయింది. బాష్యం రామకృష్ణ, లావు కృష్ణదేవరాయులు వంటి పేర్లు పరిశీలిస్తారని ఎక్కువ మంది అనుకున్నారు కానీ అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన పేరు మీడియాలోకి వచ్చే వరకూ చాలా మందికి తెలియదు. కానీ వచ్చిన తర్వాత ఆయ.న గురించి మాట్లాడుకోని వారు లేరు.

డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాలో జెండా  పాతిన తెలుగు వాళ్లలో  ముఖ్యుడు.  యువరల్డ్ అనే కంపెనీని అమెరికాలోనే నెంబర్ వన్ లెర్నింగ్ సంస్థగా తీర్చిదిద్దారు. ఎంతో మంది అమెరికన్లు ఆయన సంస్థలో ఉద్యోగులు. ఇది ఆయన వ్యాపార విజయం. ఇది సాధించడానికి ఆయన అక్కడే పుట్టలేదు.. ఆయన తల్లిదండ్రులు అమెరికాలో సెటిలవ్వలేదు.   తెలుగు గడ్డ మీద పుట్టి.. అక్కడే ఎంబీబీఎస్ చదువుకున్నారు. పెమ్మసాని  చంద్రశేఖర్   ఎంతో క్రమశిక్షణతో నిబద్దతతో ఎదిగిన శక్తి.  మెడికల్ ఎంట్రన్స్ లో రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 7 వ ర్యాంక్ సాధించారు.       పెమ్మసాని  రాత్రికి రాత్రి దిగిపోయారని కొంత మంది అనుకుంటూ ఉంటారు కానీ అది నిజం కాదు.  పెమ్మసాని తండ్రి తెలుగుదేశం పార్టీలో చాలా కాలం పని చేశారు.   చంద్రశేఖర్ మొదటినుండి  తన తండ్రి ద్వారా తెలుదేశం పార్టీకి  తన సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు.

పెమ్మసాని చంద్రశేఖర్ నాయకత్వ లక్షణాలను గుర్తించి కోడెల శివప్రసాదరావే ఆయనను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించారు.  చంద్రశేఖర్ సాధించిన విజయాలను యువత స్ఫూర్తిగా తీసుకుంటుందనిభావించిన చంద్రబాబునాయుడు  2014 నరసరావుపేట పార్లమెంట్ సీటును ఇవ్వాలని అనుకున్నారు.   రాజకీయ సమీకరణాలతో సాధ్యం కాలేదు. ఇప్పుడు గుంటూరు నుంచి అవకాశం కల్పించారు.  పెమ్మసాని చంద్రశేఖర్ కి అధికారం కోసమో..  ఆదాయం కోసమో  తను ఎంపీ అవ్వాల్సిన అవసరం లేదు.  ఆయన ఓ లక్ష్యం  కోసం  వచ్చారు.

పెమ్మసాని అమెరికాలో విజయవంతమైన పారిశ్రామిక వేత్త అయినా ఏపీలో మాత్రం ఆయన కార్పొరేట్ రాజకీయంచేయడం లేదు.  సహజమైన రాజకీయం చేస్తున్నారు.   చాలా కాలం అమెరికాలో ఉన్నా.. పెమ్మసాని చంద్రశేఖర్ .. తెలుగును కానీ.. ఇక్కడి పరిస్థితుల్ని కానీ ఎప్పుడూ మిస్ కాలేదు. పూర్తి స్థాయి అవగాహనతో ఆయన చేస్తున్న రాజకీయం అందర్నీ ఆకట్టుకుంది. వచ్చిన రెండు వారాల్లోనే గల్లా జయదేవ్ ను మించిన రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఆయన హాట్ టాపిక్ గా మారారు.

 

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి