చాన్నాళ్లుగా ఎదురుచూసిందే జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ కల్యాణ్ కోరిక నెరవేరబోతోంది.ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే కేంద్రంలోని పార్టీతో పొత్తుపెట్టుకుంటున్నామని చంద్రబాబు చేసిన ప్రకటన నిజం కాబోతోంది. ఇప్పుడు టెక్నికల్ గా ఒక ట్విస్ట్ కనిపిస్తోంది. టీడీపీ ఎన్డీయేతో చేరింది. అంటే ఎన్డీయే కూటమి మేనిఫెస్టోనే ఇప్పుడు ఏపీకి కూడా అమలు చేయాల్సి రావచ్చు, దానిలోనే టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను కూడా జతచేయడం అనివార్యం కావచ్చు. ఒకటి రెండు రోజుల్లో ఈ పని జరగబోతోంది. అంతకు మించి మూడు పార్టీల కేడర్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది…..
ఏపీలో పొత్తుల వ్యవహారంపై క్లారిటీ వచ్చేసింది. రెండు పర్యాయాలు హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత పిక్చర్ క్లియర్ అయ్యింది.పొత్తు పొడిచినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ దిశగా అది ఉమ్మడి ప్రకటనగా మారింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలోని పార్టీతో కలిసి పనిచేయడం ముఖ్యమని అందుకే బీజేపీతో కలుస్తున్నామని చంద్రబాబు బహిరంగ ప్రకటన చేశారు. 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని ఆ మూడు పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. జనసేన బయట నుండి మద్దతు తెలిపింది. టీడీపీ – బీజేపీ కూటమి భారీ విజయాన్ని దక్కించుకుంది. వైసీపీ కేవలం 63 స్థానాలకు పరిమితమైంది. అయితే ఈసారి అంతకంటే పెద్ద విజయమే దక్కించుకుంటామని టీడీపీ, జనసేన భావించాయి. అందుకే బీజేపీ కలుపుకునేందుకు చివరి వరకు ప్రయత్నించాయి. అందులో సక్సెస్ కావడంతో.. తప్పకుండా కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నాయి.
ఆ రోజు ప్రత్యేక హోదా కోసం ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐదేళ్లపాటు చంద్రబాబు ఒంటరయ్యారు. ఇటీవలి కాలంలో మాత్రం జనసేన వెళ్లి టీడీపీతో కలిసింది. ఇప్పుడు బీజేపీ కూడా కలవడం కలిసొచ్చే అంశంగా చెప్పక తప్పదు….
వైసీపీ సర్కారుపై విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉందని టీడీపీ, జనసేన ఇద్దరికీ అర్థమైంది. గత నాలుగున్నర సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ నుంచి జగన్ కు అంతర్గత సహకారం అందడం వల్లే ఎటువంటి ఇబ్బంది రాలేదని.. ఇప్పుడు బీజేపీ నేతృత్వ ఎన్డీయే కూటమితో తాము కలిసి వెళ్లడం వల్ల జగన్ కు సహాయ నిరాకరణ ఎదురవుతుందని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో చంద్రబాబు విభేదించడంతో కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలపరంగా జగన్ కు సహకారం అందించిందని విశ్లేషణలు ఉన్నాయి. అదే సమయంలో జనసేన ఒంటరి పోరుకు వెళ్ళింది. అటు కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కూడా జగన్ కు సహకరించింది. దీంతో చంద్రబాబు ఒంటరి అయ్యారు. ఎన్నికల వ్యవస్థలో సరైన సాయం లేక వెనుకబడ్డారు. జనసేన చీల్చిన ఓట్లతో తెలుగుదేశం పార్టీకి పరాజయం ఎదురయ్యింది.
ఓట్ల చీలిక మామూలు విషయం కాదు . మెజార్టీ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన ఓట్లు కలిస్తే వైసీపీ కంటే చాలా ఎక్కువే ఉంటాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన కారణం కూడా అదేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పుడు బీజేపీ కూడా కలిస్తే ఓటింగ్ సరళే మారిపోతుందని, తమకు అనుకూలమవుతుందని టీడీపీ, జనసేన అంచనా వేసుకుంటున్నాయి…
బీజేపీకి ఏపీలో కనిష్టంగా ఐదు శాతం ఓట్లు ఉంటాయని 2014 వరకు నిరూపితమైన అంశం. అయితే మిత్రభేదం కారణంగా గత ఎన్నికల్లో కనీసం ఒక శాతం ఓట్లు కూడా లేదు. చాలా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో జనసేనకు ఆరు శాతం వరకు ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి జనసేన బలం గణనీయంగా పెరిగింది. దాదాపు 12 శాతం వరకు ఓట్లు ఆ పార్టీ సాధించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో జనసేన గెలుపు పై అపనమ్మకం ఉన్నవారు వైసీపీకి ఓటు వేశారు. కాపు సామాజిక వర్గం సైతం వైసీపీ వైపే మొగ్గు చూపింది. అయితే ఈసారి పవన్ జాగ్రత్త పడ్డారు. కాపు సామాజిక వర్గం సైతం ఏకతాటిపైకి వచ్చింది. జనసేనకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. ఈ లెక్కన జనసేన ఓటు శాతం కూడా పెరిగిందని చంద్రబాబు అంచనా వేశారు. అందుకే ఆ పార్టీని కలుపుకొని ముందుకెళ్లారు.మోదీ సర్కారు ఏపీ ప్రజలను మోసగించిందని చంద్రబాబు గత ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆ ప్రచారం నిజమై బీజేపీ దెబ్బతిన్నా…ఓట్లు చీలికతో టీడీపీ కూడా గెలవలేదు. గత ఎన్నికల్లో గెలిచిన వైసీపీకి, ఓడిన టీడీపీకి పదిశాతం ఓట్ల తేడా ఉంది. ఇప్పుడు మూడు పార్టీలు గెలవడం వల్ల.. ఆ పది శాతం పూడిపోయి…మరో పది శాతం వరకు అదనంగా ఓట్లు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు, పవన్ అంచనా వేస్తున్నారు. పైగా గత ఎన్నికల్లో తటస్థ జనం వైసీపీ వైపు మొగ్గు చూపడం వల్ల బీజేపీకి ఓట్ల శాతం పూర్తిగా పడిపోయింది. ఇక వైసీపీ తప్పిదాలు, అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఆ మూడు పార్టీలు సక్సెస్ అయ్యాయి. రాజకీయ వేధింపులు ప్రధాన ప్రచారాస్త్రం కాబోతున్నాయి…
జగన్ ఇప్పుడు పూర్తి డిఫెన్స్ లో ఉన్నారు. ఆయన పార్టీ నుంచి ఒక్కరొక్కరుగా వెళ్లిపోతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో మూడునాలుగు సార్లు ఇంచార్జీలను మార్చుతున్నారు.ఐనా గెలుస్తామన్న నమ్మకం లేదు. అధికార పార్టీకి ఉన్న ఆ విపత్కర పరిస్థితి ఇప్పుడు టీడీపీ నేతృత్వ కూటమికి ఉపయోగపడుతుంది. పైగా చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే రాష్ట్ర ఆర్థిక స్థితి ఇంత ఘోరంగా ఉండేది కాదని ప్రతీ ఒక్కరు చెప్పుకుంటున్నారు. రాజధాని నిర్మించాలన్న, పెట్టుబడులు తీసుకురావాలన్న చంద్రబాబు వల్లే సాధ్యమని జనం నిర్ణయానికి వచ్చేశారు. అందుకే ఈ సారి టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి విజయా ఖాయమని తేలిపోయింది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…