వైసీపీది ఆత్మవిశ్వాసమా. అతి విశ్వాసమా. ఎన్నికల ఫలితాల లోపు జనాన్ని మెస్మరైజ్ చేయాలనుకుంటోందా. లేక హైప్ క్రియేట్ చేయాలనుకుంటోందా. నిజంగా గెలుస్తామన్న నమ్మకం పెరిగిందా.. వైసీపీ నేతలంతా ఇప్పుడు విశాఖకు ఎందుకు క్యూ కడుతున్నారు.. అక్కడ ఏం చేస్తున్నారు… జగన్ చెప్పిందీ, వైసీపీ బ్యాచ్ చేస్తున్నదీ ఒకటేనా….
పోలింగ్ పూర్తయిన వెంటనే సీఎం జగన్ విదేశాలకు వెళ్లిపోయారు. వెళ్లే ముందు వైసీపీ ఒక స్టేట్ మెంట్ వదలింది. జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని దాని సారాంశం. ఇక అంతే వైసీపీ జనం యాక్టివ్ అయిపోయారు. పైగా ఎన్నికల్లో సభల్లో కూడా విశాఖలో ప్రమాణ స్వీకార అంశాన్ని జగన్ ప్రస్తావించడంతో వైసీపీ వారికి ఇప్పుడు వైజాగ్ ఫీవర్ పట్టుకుంది. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పార్టీ నేతలు, శ్రేణులంతా వైజాక్ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఆంధ్రా యూనివర్శిటీలోని విశాలమైన ప్రాంగణంలో ముఖ్యమంత్రి జగన్ వేలాది మంది జనాల సమక్షంలో సీఎంగా ప్రమాణం చేస్తారని అంటున్నారు. ఈ సభ ఏర్పాట్లను పార్టీ పరంగా నేతలు చూస్తున్నారు.వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని వారు అంటున్నారు. విశాఖ నుంచే జగన్ పాలన ప్రారభిస్తారని వారు అంటున్నారు.
జగన్ మూడు ముక్కలాట మొదలు పెట్టినప్పటి నుంచి విశాఖపై ప్రత్యేక దృష్టిపెట్టారు. వైజాగ్ ప్రజలకు ఇష్టం ఉన్నా లేకపోయినా వైసీపీ నేతలు అక్కడ తిరుగుతూ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అని ప్రచారం చేస్తున్నారు. రుషికొండను బోడి కొట్టించడం లాంటి నెగిటివ్ పాయింట్స్ కూడా అందులో ఉన్నాయి. జగన్ రెండో సారి గెలిచి వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తే అంతా తమకు అనుకూలంగా మారుతుందని వైసీపీ జనం ఎదురు చూస్తున్నారు…
వైసీపీ నేతలంతా వైజాగ్ జపం చేస్తున్నారు. విశాఖకు చేరుకోవడానికి ఏపీలోని నలుమూలల నుంచి వైసీపీ నేతలు సిద్ధం అవుతున్నారు. విశాఖలో ఈ నెల 7 నుంచి తొమ్మిదవ తేదీ వరకూ మూడు రోజుల పాటు హోటళ్ళు అన్నీ అడ్వాన్స్ గా బుక్ అయిపోయాయి. రిసార్ట్స్ తో పాటు విడిది చేసేందుకు వీలైన ప్రాంతాలు అన్నీ కూడా ముందే బుక్ చేసేసారు. ఆ రోజున విశాఖకు వచ్చే విమానాలలో కూడా టికెట్లు బుక్ చేసేసుకున్నారు. ఈసారి కూడా తామే విజయం సాధిస్తామని వైసీపీ చాలా నమ్మకంగా ఉంది. అత్యధిక సీట్లను సాధిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి వంటి వారు చెబుతున్నారు. దానితో ఇప్పుడు వైజాగ్ వాసులకు కొత్త భయం పట్టుకుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాల్లో వైసీపీ గెలిస్తే ఆ రోజు నుంచే వైజాగ్ నగరం అధికారపార్టీ కార్యకర్తలతో నిండిపోతుందని అనుమానిస్తున్నారు. నేతల రాకను పురస్కరించుకుని కార్యకర్తలంతా నాలుగు రోజుల ముందే వైజాగ్ చేరతారని అనుమానిస్తున్నారు. జనంతో నగరం నిండిపోతే..తమకు ఇబ్బందులు తప్పవని సగటు వైజాగ్ వాసి అంటున్నారు. పైగా ఇంతకాలం హైదరాబాద్, వైజాగ్ కే పరిమితమైన గుంపులు ఇప్పుడు వైజాగ్ వైపు మళ్లితే పరిస్థితి ఎలా ఉంటుందోనని లెక్కలేసుకుంటున్నారు..
టీడీపీ గుంభనంగా ఉంది. తాము గెలిస్తే ప్రమాణ స్వీకారం ఎప్పుడన్న విషయాన్ని ఎక్కడా ప్రకటించడం లేదు.జగన్ ఇంటికి పోవడం ఖాయమని మాత్రం టీడీపీ నేతలు అంటున్నారు. వైసీపీ ఒక్కటే డబుల్ స్పీడులో ఉంది. జయం మనదేరా అంటోంది. చూడాలి మరి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…