సమర్థ ఆఫీసరు కోసం మంత్రుల పోటీ…

By KTV Telugu On 19 October, 2024
image

KTV TELUGU :-

డిఓపీటీ ఉత్తర్వులతో తెలంగాణ నుంచి రిలీవైన నలుగురు ఐఏఎస్ అధికారులకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ ఐఏఎస్ లలో ఒకరైన ఆమ్రపాలి మిగిలిన అధికారులతో కలిసి ఏపీ సచివాలయలో రిపోర్ట్ చేశారు. త్వరలో ఈమె పోస్టింగ్ పై క్లారిటీ రావొచ్చని అంటున్నారు. అయితే ఆమె పవన్ టీమ్ లోకి వెళ్లే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది

ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి ఇకపై ఏపీ ప్రభుత్వంలో కొత్తగా బాధ్యతలు నిర్వహించనున్నారు. విశాఖ తన స్వస్థలంగా డీఓపీటీకి ఇచ్చిన వివరాళ్లో పేర్కొనడంతో.. ఆమెను ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆమె న్యాయపోరాటం చేశారు.. మిగతా అధికారులతో కలిసి హైకోర్టును, క్యాట్ ను ఆశ్రయించారు. అయితే… ఎక్కడా వీరికి ఊరట లభించలేదు.వాస్తవానికి చురుకైన అధికారిణిగా ఆమ్రపాలికి పేరుంది. అందువల్లే… కేంద్రం నుంచి రప్పించి మరీ ఆమెను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నియమించిందీ తెలంగాణ ప్రభుత్వం. గతంలో ప్రధాని కార్యాలయంలో దక్షిణాది రాష్ట్రాల వ్యవహారాలను ఆమె పర్యవేక్షించేవారు!

తెలంగాణ ప్రభుత్వం ఆమ్రపాలిని అయిష్టంగానే రిలీవ్ చేసిందని చెప్పక తప్పదు. ఆమ్రపాలి..అమరాపతిలోకి అడుగు పెట్టిన వెంటనే ఆమెకు ఏ బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ మొదలైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీలో ఆమెకు చోటు దొరుకుతుందని, సమర్థంగా ఆమె సేవలు వినియోగించుకుంటారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేస్తూ జనసేనకు ఓ ఇమేజ్ తెచ్చిపెట్టుకుంటున్న పవన్ కల్యాణ్.. తన దగ్గర సమర్థులైన అధికారులు కావాలని ఆకాంక్షిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తన శాఖలను ఏరి కోరి ఎంపిక చేసుకొవడంతో పాటు.. కేరళ కేడర్ కు చెందిన అధికారి మైలవరపు కృష్ణతేజను పట్టుబట్టి మరీ తన టీమ్ లో చేర్చుకున్నారు . యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్స్ తో పనిచేయాలని పవన్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమ్రపాలి పేరు తెరపైకి వచ్చింది!

పవన్ వద్ద ఇప్పుడున్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, తాగు నీటి సరఫరా, సైన్స్ & టెక్నాలజీ, అడవులు, పర్యావరణం శాఖలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో… యంగ్ & డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న ఆమ్రపాలీకి ఈ శాఖల్లోనే పోస్టింగ్ ఉండొచ్చనే ప్రచారం జరుగుతుంది.

మరో పక్క తెలంగాణ నుంచి వచ్చిన అధికారులు తమకు పేషీలో ఉండాలంటే తమ పేషీలో ఉండాలని కొందరు మంత్రులు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇంతకాలం వైసీపీ వారితో అంటకాగిన అధికారులను లూప్ లైన్లో పెట్టేసి ఫ్రెష్ గా వచ్చిన వాళ్లతో పనులు చేయించుకోవాలని మంత్రులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పేర్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే నిన్న అమరావతిలో అడుగుపెట్టిన అధికారులు, ఇవాళ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన తర్వాతే అసలు విషయం తెలుస్తుందని అధికార వర్గాల టాక్…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి