తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాజకీయ భవితవ్యం ఏమిటి. క్రియాశీలంగా కనిపిస్తున్నా టీడీపీలో ఆమెకు అంత సీన్ లేదా.. విజయవాడ టు విశాఖ తిరుగుతున్నా ఆమె పట్ల అధిష్టానానికి అభిమానం లేదా. పాయకరావుపేటలో జరుగుతున్నదేమిటి. అక్కడి కేడర్ ఏమంటోంది…
విశాఖ జిల్లా పాయకరావుపేట పాలిటిక్స్ టీడీపీలో కాక రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే అనితకు అధిష్టానం తెలుగు మహిళ అధ్యక్ష పదవి ఇచ్చినప్పటికీ రాజకీయాల్లో ఆమెదీ ముళ్లబాటేననిపిస్తోంది. ఫైర్ బ్రాండ్ అనిత పట్ల పార్టీలో అంతగా సముఖత కనిపించడం లేదు. హైకమాండ్ బ్లెసింగ్స్ ఉన్న మాట కూడా నిజం కాదనిపిస్తోంది. అనితకు టికెట్ ఇవ్వవద్దు అని డైరెక్ట్ గా లోకేష్ కే లోకల్ లీడర్స్ చేప్పడం సంచలనంగా మారింది.తూర్పు గోదావరి జిల్లా నుంచి పాదయాత్ర పూర్తి చేసుకుని పాయకరావు పేట మీదుగా విశాఖ జిల్లాలో ప్రవేశించిన నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా స్థానిక నేతలు కలసి పాయకరావుపేటకు మరో క్యాండిడేట్ ని పెట్టమని కోరారు. ఆమె అయితే మేము సహకరించమని స్పష్టంగా చెప్పేశారు.
అనిత పట్ల ఉన్న వ్యతిరేకతకు కారణం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తడం సహజమే.రోజూ టీవీల్లో కనిపిస్తూ అందరితో కలిసిపోయే అనిత ఎందుకు దూరమవుతున్నారన్నదీ పెద్ద ప్రశ్నే. నియోజకవర్గంలో ఆమెకున్న వ్యతిరేకతను తగ్గించుకోని పరిస్థితి వచ్చిందా అన్నదీ అనుమానమే….
అనిత ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో పార్టీని పట్టించుకోలేదని పెద్ద ఎత్తున ఫిర్యాదులు లోకేష్ కి రావడంతో ఆయన బిత్తర పోయారు. ఆమెకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేస్తామని ఆమెకు ఇస్తే మాత్రం తామే దగ్గర ఉండి ఓడిస్తామని లోకేష్ కి పాయకరావుపేట తెలుగు తమ్ముళ్ళు చెప్పేశారు. దీంతో లోకేష్ ఈ ఫిర్యాదుల మీద ఏమి చేస్తారో అని అంతా అసక్తిగా చర్చించుకుంటున్నారు.అయితే లోకేష్ కు కూడా తెలియని విషయం ఒకటి ఉందని టీడీపీలో విశ్వసనీయ సమాచారం. ఆమెకు టికెట్ లేదని చంద్రబాబు ఎప్పుడో వ్యక్తిగతంగా చెప్పేశారట. పాయకరావుపేటలో పార్టీని గెలిపించే బాధ్యతను ఆమె మీద వేశారట. పార్టీ గెలిచిన పక్షంలో తప్పకుండా ఎమ్మెల్సీ ఇచ్చి, మంచి పదవి కూడా కట్టబెడతానని చెప్పారట. దానితో పట్టువదలని విక్రమార్కుడిలా అనిత రోజూ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఎక్కడ నిరాశ కనిపించకుండా చూసుకుంటున్నారు.
పేటలో అనితకు వ్యతిరేక ఉందని చంద్రబాబుకు ముందే తెలుసు. అందుకే ఆమెను సున్నితంగా పక్కన పెట్టారు. ఆ సంగతి తెలియని కేడర్ టెన్షన్ పడుతోంది. నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలన్న కోరికతో చంద్రబాబు పావులు కదుపుతున్నారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థి అయితే వైసీపీ నుంచి వచ్చిన నేతకైనా టికెట్ ఇద్దామన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. చూడాలి మరి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…