తణుకు అన్న క్యాంటీన్ లో ప్లేట్లను మురికి నీటితో కడుగుతున్నారని వీడియో బయటకి రావడంతో ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆరా తీశారు. సరైన శుభ్రత పాటించడం లేదా అని అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఇస్కాన్ మూమెంట్ ప్రతినిధులతో కూడా మాట్లాడారు. మురికి నీటితో కడుగుతున్నామన్నది పూర్తిగా అవాస్తవమని అధికారులు మంత్రికి తెలిపారు వాష్ బేసిన్ లోని ప్లేట్లు తీస్తుంటే వీడియో తీసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎక్కువ మంది రావడంతో డస్ట్ బిన్ కి బదులుగా వాష్ బేసిన్ లో ప్లేట్లను పెట్టారని అధికారులు వివరించారు. సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వాస్తవం కాదని స్పష్టం చేశారు అన్న క్యాంటీన్లో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయని హరే కృష్ణ మూమెంట్ ప్రతినిధులు మంత్రి నారాయణ కు తెలిపారు
పేదోడి అన్నంపై మీ ఏడుపులు చూస్తే అసలు మీరు మనుషులేనా అనిపిస్తుంది అక్కడ స్పష్టంగా చేతులు కడిగే స్థలం అని రాసి ఉంది. కావాలని బురద చల్లడానికి చేతులు కడిగే స్థలం లో అన్నం తిన్న ప్లేట్లు పడేసింది ఒక బ్యాచ్. అదే సమయంలో చేతులు కడిగే సింక్ బ్లాక్ అవడంతో సిబ్బంది వచ్చి ఆ ప్లేట్లు చెత్త తీస్తున్న సమయంలో ఒక 40 సెకండ్ల వీడియో తీసి సిగ్గులేని ప్రచారం చేస్తున్నాడు జగన్ రెడ్డి అంటూ తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారం పై స్పందించింది
ప్రతి అన్న క్యాంటీన్లో ప్లేట్లు కడిగే స్థలం వేరే ఉంటుంది వేడి నీటిలో సోప్ వాటర్ లో పరిశుభ్రమైన ప్రాంతంలో శుభ్రం చేస్తారు. జగన్ రెడ్డి నువ్వు నీ సైకోలు ఎంత విష ప్రచారం చేసినా అన్న క్యాంటీన్లు ఆగవు వచ్చే నెలలో మరో 70 క్యాంటీన్లు మా ప్రభుత్వం ప్రారంభిస్తుంది. నువ్వు ఎన్ని ఫేక్ నాటకాలు ఆడిన నీ కుట్టలు ప్రజలకు తెలుసు అంటూ విరుచుకుపడ్డారు
ఈ వీడియో పై స్పందించిన ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీం కూడా స్పందించింది, ప్రతి అన్న క్యాంటీన్లో వేడి సోపునీటితో నిత్యం తిన్న ప్లేట్లను శుభ్రం చేస్తారు చేతులు కడిగే స్థలంలో స్పష్టంగా చేతులు కడిగే స్థలం అని రాసి ఉంది అలా రాసినా, చేతులు కడిగే స్థలంలో అన్నం తిన్న రేట్లు పడేస్తే, సింక్ బ్లాక్ అవడంతో సిబ్బంది వచ్చి ఆ ప్లేట్లు చెత్త తీస్తున్న సమయంలో 40 సెకండ్ల వీడియో తీసి, దుష్ప్రచారానికి ఒడిగట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని, పరిశుభ్రతకు నాణ్యతకు రుచికి పెట్టింది పేరైన అన్న క్యాంటీన్ల విషయంలో ఫేక్ ప్రచారం మానవత్వం అనిపించుకోదు అని ట్వీట్ చేశారు
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…