ఒంటరిగా అడుగులు వేయడానికి చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ ధైర్యం లేదు. ప్రత్యక్ష పొత్తులు..పరోక్ష పొత్తులు కలగలిపి రక రకాల మేథావుల స్వరాలను కిరాయికి తీసుకొని ఎన్నికల బరిలో దిగడమే చంద్రబాబు అజెండా. ఈ క్రమంలో పరస్సర విరుద్ధ భావజాలాలున్న పార్టీలతో ఏకకాలంలో స్నేహాలు కొనసాగించడంలో చంద్రబాబు నాయుణ్ని మించిన అవకాశవాద అరాచక రాజకీయ నాయకుడు ప్రపంచంలోనే మరొకరు లేరు.
ఒకే సారి పది మందిని ప్రేమించగలరు చంద్రబాబు. పదిమందితోనూ అనుబంధాలు కొనసాగించగలరు.
ఆ పదిమందిలో పరస్పర విరుద్ధ భావాలున్నవాళ్లు ఉండచ్చు..బద్ధ విరోధులు కూడా ఉండచ్చు. అందరితో ఏకకాలంలో వ్యవహారాలు కొనసాగించేస్తారు చంద్రబాబు. కాంగ్రెస్ వ్యతిరేకతలోంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టేందుకే ఎన్టీయార్ టిడిపిని స్థాపించారు. అటువంటి ఆగర్భ శత్రు పక్షమైన కాంగ్రెస్ తో చేతులు కలిపిన ఘనత చంద్రబాబుది.అంతే కాదు కాంగ్రెస్ కు పూర్తి వ్యతిరేక పక్షమైన బిజెపితోనూ అంటకాగుతున్నారు చంద్రబాబు.
ఓ సారి కాంగ్రెస్ తోనూ మరోసారి బిజెపితోనూ తిరిగితే కొంత వరకు అర్దం చేసుకోవచ్చు. కానీ చంద్రబాబు అలా కాదు ఏకకాలంలో ఇద్దరితోనూ అఫైర్లు నడిపేస్తారు. బిజెపితో కాపురం చేస్తూనే చీకట్లో కాంగ్రెస్ పార్టీకి కన్నుగీటారు. కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ఖర్చులకు ఉంటాయని చంద్రబాబు నాయుడే డబ్బులు కూడా పంపిస్తారన్నది బహిరంగ రహస్యం. ఇటీవల తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓ విచిత్ర ఘటన. ఒక పక్క బిజెపితో పొత్తు కోసం వెంపర్లాడుతూనే..మరో పక్క తెలంగాణా కాంగ్రెస్ ఓట్లు చీలకూడదని టిడిపిని ఎన్నికల బరిలో లేకుండా చేశారు చంద్రబాబు.
ఒక పక్క బిజెపితో అంటకాగుతూనే మరో పక్క బిజెపిని సైద్ధాంతికంగా ద్వేషించే కమ్యూనిస్టు పార్టీలతోనూ స్నేహం కొనసాగిస్తున్నారు చంద్రబాబు. కమ్యూనిస్టులను తన అవసరాలకోసం వాడుకున్న చంద్రబాబు బిజెపితో పొత్తు ఉన్నప్పుడు కామ్రేడ్లను అవమానకరంగా దూరం పెట్టేస్తారు. అయినా కామ్రేడ్లు ఏ మాత్రం సిగ్గు పడకుండా చంద్రబాబు తో పొత్తు కోసం కిందా మీదా అయిపోతూ ఉంటారు. 2014 ఎన్నికల్లో బిజెపితో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడంతో కామ్రేడ్లకు పొత్తు పెట్టుకునే అవకాశం దక్కలేదు. 2019 ఎన్నికల్లో చంద్రబాబే కమ్యూనిస్టు పార్టీల్లో తన మిత్రులను ఒప్పించి జనసేనతో పొత్తు కుదిర్చారు.
కనీసం 2024 ఎన్నికల్లో అయినా ఏపీలో బోణీ కొట్టాలన్న ఆశతో ఉన్న కామ్రేడ్లు టిడిపితో పొత్తు పెట్టుకోవాలనుకున్నారు. ఎందుకంటే పాలక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒంటరి పోరాటానికే సిద్దం అంటారు. పొత్తుల కోసం ఆయన ఇంత వరకు ప్రయత్నించలేదు. అందుకే కామ్రేడ్లు టిడిపిపై ఆశలు పెట్టుకున్నారు. అందుకే 2019లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచి..టిడిపి తో కలిసే కార్యక్రమాలు చేపడుతున్నారు సిపిఐ నేతలు రామకృష్ణ,నారాయణ.చంద్రబాబు నాయుడి అజెండానే అనుసరిస్తూ అయిదేళ్లుగా రాజకీయాలు చేశారు.
రాజధానిలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇస్తే అక్కడ సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని.. ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఆపాలని టిడిపి నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే కామ్రేడ్లు కనీసం ఆ దురహంకారాన్ని ప్రశ్నించలేదు. అంతగా చంద్రబాబు నాయుణ్ని మోస్తూ వచ్చారు రామకృష్ణ, నారాయణలు.దీనిపై పార్టీలో సీనియర్ కామ్రేడ్లే మండి పడ్డట్లు సమాచారం.
సిపిఎం పార్టీ నాయకత్వం ఏం ఆలోచిస్తున్నదో తెలీదు కానీ.. సిపిఐ అంత దారుణంగా అయితే సిపిఎం వ్యవహరించడం లేదు.ఆ మాటకొస్తే సీపీఎం కురువృద్ధుడు పాటూరి రామయ్య అయితే ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు ఫిదా అయ్యారు. ఆయన స్వయంగా జగన్ మోహన్ రెడ్డిని కలిసి చాలా బాగుందని మెచ్చుకున్నారు కూడ.
తాజాగా చంద్రబాబు నాయుడు వాలంటీర్ల చేత పింఛన్లు పంపిణీ చేయకుండా ఆపాలని ఫిర్యాదు చేయించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఒకటో తేదీనే అందాల్సిన పింఛన్లు అందలేదు. ఇంటికి వచ్చే పింఛన్లన సచివాలయాలకు వెళ్లి తీసుకోవలసి వచ్చింది. మండు టెండల్లో పింఛను దార్లు నరకయాతన పడుతూ ఉంటే..సిపిఐ నేత రామకృష్ణ ఈ దుస్థితికి కారణమైన చంద్రబాబును పల్లెత్తు మాట అనలేదు సరికదా బాబు కుట్ర వల్ల తలెత్తిన ఉపద్రవానికి ప్రభుత్వానిదే బాధ్యత అంటూ వితండ వాదన చేశారు. దీనిపైనా వామపక్ష మేథావులు మండి పడుతున్నారు.2024 ఎన్నికల్లోనూ చంద్రబాబు నాయుడు కామ్రేడ్లకు టెంకి జెల్ల కొట్టి బిజెపి-జనసేనలతో పొత్తు పెట్టుకున్నారు. అయినా రామకృష్ణ లాంటి కామ్రేడ్లు చంద్రబాబు అనుకూల జపమే చేయడం విశేషం.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…