అసెంబ్లీ స్పీకర్ గా రఘురామ – Raghurama To Be AP Assembly speaker ?

By KTV Telugu On 27 March, 2024
image

KTV TELUGU :-

రాజకీయాలు కొందరికి  కలిసి రావంటారు. రఘురామకు కూడా అదే పరిస్థితి ఉందా లేదా అన్నది చెప్పలేము..తన జీవితంలో  చాలా లేటుగా రఘురామ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.  నేతల వెంట తిరిగి వందల కోట్ల కాంట్రాక్టులు పొందే రఘురామ 2019లో మాత్రమే ఎన్నికల్లో  పోటీ చేసి నరసాపురం వైసీపీ ఎంపీగా గెలిచారు. తర్వాత  పరిణామాల్లో ఆయన ఫైనల్ గా సైడైపోవాల్సిన  పరిస్థితి వస్తుందనుకుంటున్న  తరుణంలో ఇప్పుడు సోషల్  మీడియాలో కొత్త  గేమ్ కు తెరలేచింది. రఘురామకు అసెంబ్లీ స్పీకర్ పదవి ఇవ్వాలని కొందరు ప్రచారం చేస్తున్నారు. దానికి కూడా టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియానే కారణమని చెప్పక తప్పదు. రఘురామ  విషయంలో డిఫెన్స్ లో పడిపోయిన టీడీపీని బయటపడేసేందుకే ఈ గేమ్ ఆడుతున్నారని తెలియని కూడా కాదు….

రఘురామకు  బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వలేదు. అధికార వైసీపీ ఎంపీగా ఉంటూనే అదే పార్టీపై యుద్ధాన్ని ప్రకటించిన రఘురామ కృష్ణ రాజు ఆ పార్టీలోకి వెళ్లలేని పరిస్థితుల్లో ఇంతకాలం తను కొమ్ముకాసిన టీడీపీ ఆదుకుంటుందని ఎదురుచూశారు.  టీడీపీ ఎన్డీయేలో ఉన్నందున ఆ కూటమిలో నరసాపురం టికెట్ తనకే వస్తుందని భావించారు.అయితే రఘురామ  బేసిగ్గా ఒక తప్పు చేశారు. ఆయన ఏ పార్టీలో చేరలేదు. బీజేపీలోనో, టీడీపీలోనో చేరి ఉంటే.. ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అయ్యేదేమో. కాకపోతే ఆయన ఆ పని చేయకుండా టికెట్ ఎగ్గొట్టేందుకు అవకాశం ఇచ్చారు. బీజేపీకి మొదటి నుంచి రఘురామ పట్ల ఆసక్తి లేదని ఆయన అర్థం చేసుకోలేకపోయారు. దానితో టీడీపీ ఏం చేసిందో తెలియదు గానీ, నరసాపురం టికెట్ బీజేపీ ఖాతాలోని వెళ్లిపోవడం భూపతిరాజు శ్రీనివాస వర్మకు  టికెట్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. దానితో రఘురామ పరిస్థితి నా ఘర్ కా నా ఘాట్ కా అన్నట్లుగా తయారైంది. అది కూటమి పార్టీలకు సైతం చెడ్డపేరు తెచ్చినట్లయ్యింది…

రఘురామకు టికెట్ ఇవ్వకపోవడంపై ప్రజాగ్రహం ఉవ్వెత్తున ఎగిసిపడింది.  ఆయన బ్యాలెన్స్ గా ఉన్నప్పటికీ రఘురామ అభిమానులు మాత్రం ఎన్డీయే కూటమిపై దుమ్మెత్తిపోస్తున్నారు. దానితో టీడీపీతో పాటు ఆ పార్టీ మీడియా ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రఘురామ  ఎపిసోడ్ కారణంగా దెబ్బతిన్న ఎన్డీయే ప్రతిష్టను కూడగట్టుకునేందుకు  ఆయన్ను ఏదో విధంగా అకాడమేడ్ చేయాలని ప్రయత్నిస్తోంది…

రఘురామకు  జరిగిన అవమానంపై అమరావతి ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహం చెందారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే రఘురామకు మద్దతిస్తామని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అన్నారు.  వైసీపీ అప్రజాస్వామిక పాలనా విధానాలు, సీఎం జగన్‌పై ప్రాణాలొడ్డి పోరాడిన ఏకైక నాయకుడు త్రిబుల్‌ ఆర్‌ అని ఆయన  ప్రశంసించారు. ఇంకా కొంతమంది రఘురామకు మద్దతివ్వడంతో  అసలు జరిగిన నష్టాన్ని టీడీపీ అర్థం  చేసుకుంది. ఆయనకు తామే అవకాశమివ్వాలని టీడీపీ నాయకత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది. పశ్చిమ గోదావరిలో ఏదైనా అసెంబ్లీ స్థానంలో బరిలో దించాలని భావిస్తోంది. వాస్తవానికి ఆయనకు నరసాపురం లోక్‌సభ స్థానంలోనే బీజేపీ అభ్యర్థిగా అవకాశం లభిస్తుందని టీడీపీ వర్గాలు అనుకున్నాయి.రఘురామకు సీటు దక్కకపోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో తామే టీడీపీ తరఫున టికెట్‌ ఇవ్వడంపై టీడీపీ నాయకులు దృష్టి సారించారు. తొలుత విజయనగరం లోక్‌సభ స్థానంలో పోటీచేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. ఉత్తరాంధ్ర నాయకులు అంగీకరించలేదు. తమ ప్రాంత సామాజిక సమీకరణల రీత్యా ఈ యోచన ఉపయుక్తం కాదని.. పార్టీకి ఇబ్బంది అవుతుందని అన్నట్లు తెలిసింది. చివరకు ప్రత్యామ్నాయంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైనా అసెంబ్లీ సీట్లో ఆయనను నిలపాలన్న ప్రతిపాదన వచ్చింది. ఆ జిల్లాలో తమ కోటా కింద వచ్చిన అన్ని అసెంబ్లీ సీట్లకు టీడీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసింది. వారిలో ఎవరినైనా ఆపి రఘురామను నిలిపితే ఎలా ఉంటుందన్నదానిపై సమాచారం సేకరిస్తున్నారు. ఈ సంగతి తెలియగానే రఘురామ అభిమానులు కొత్త ప్రతిపాదనను తెరపైకి  తెచ్చారు. రఘురామను ఎమ్మెల్యేగా గెలిపించి ఏపీ అసెంబ్లీ స్పీకర్  ను చేయాలని  ప్రతిపాదిస్తున్నారు. జగన్ ను గద్దె దించడంలో రఘురామ ప్రధాన భూమిక పోషిస్తున్నందున ఆయనకు స్పీకర్ పదవి ఇస్తే.. సభలో వైసీపీ వాళ్లను ఒక ఆట ఆడుకుంటారని  కొందరు సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు.ఐదేళ్లపాటు  వైసీపీకి చుక్కలు చూపించాలంటే రఘురామ  వల్లె సాధ్యమని  చాలా మంది అభిప్రాయపడుతున్నారు…

నిజానికి రఘురామ ఒక ఫైటర్ అని నిరూపితమై చాలా  రోజులైంది. అనుకున్నది సాధించే వరకు ఊరుకోరని తెలిసిపోయింది. ఎన్నికల తర్వాత కూడా ఆయన అదే ధోరణిలో ఉంటారని ప్రత్యేకంగా  చెప్పాల్సిన పనిలేదు. అందుకే రఘురామకు స్పీకర్ పదవి ఇవ్వడమే  కరెక్టేమో…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి