ఏపీ బిజెపి పోస్ట్ మార్టం

By KTV Telugu On 20 May, 2024
image

KTV TELUGU :-

ఏపీ బిజెపిలో ఓటమి భయం మొదలైంది. పోలింగ్ ముందు ఒక లెక్క..పోలింగ్ తర్వాత మరో లెక్కతో బిజెపి అంచనాలు పూర్తిగా తలక్రిందులయ్యాయి. టిడిపి..జనసేన నుంచి సరైన సహకారం లేకపోవడం…మరోవైపు సొంత పార్టీలోని సీనియర్లు దూరంగా ఉండటంతో ఘోర ఓటమి తప్పదనే భావన ఎపి బిజెపిలో కనిపిస్తోంది. మొత్తంగా కూటమిలో చేరి పూర్తిగా నష్టపోయామని బిజెపి భావిస్తోంది. బీజేపీ హైకమాండ్‌ అయిష్టంగా కుదుర్చుకున్న పొత్తు కమలం పార్టీ పుట్టి ముంచబోతోందా? వాచ్ దిస్ స్టోరీ..

పోలింగ్ ముగిసిన తర్వాత ఎపి బిజెపిలో వింత పరిస్థితి కనిపిస్తోంది. పోలింగ్ ముందు వరకు ఉన్న ఉత్సాహం…ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో కనిపించటం లేదు. ఎపి కమలం నేతల్ని ఓటమి భయం వెన్నాడుతోంది. కూటమిలో చేరి తప్పు చేశామనే భావన బిజెపిలో కనిపిస్తోంది. టిడిపి, జనసేనతో జత కట్టిన బిజెపి ఆరు ఎంపి స్ధానాలకు, పది అసెంబ్లీ స్ధానాలకు పోటీ చేసింది. వాస్తవానికి కూటమిలో చేరడాన్ని ఎపికి చెందిన ఒరిజినల్ బిజెపి నేతలంతా వ్యతిరేకించారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వదిన దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలయ్యాక..ఆమె కుమ్మక్కు రాజకీయాల వల్లే బిజెపి హైకమాండ్‌ కూటమిలో చేరడానికి ఓకే చేసింది.

ఈ నేపధ్యంలో తప్పని పరిస్ధితులలో కూటమిలో చేరిన తర్వాత సీట్ల విషయంలోనూ పెద్ద పంచాయితీనే నడిచింది. బిజెపికి పట్టు ఉన్న ఎనిమిది ఎంపి స్ధానాలు..25 అసెంబ్లీ స్దానాలలో పోటీ చేయాలని సీనియర్లు ఒత్తిడి తెచ్చారు. అయితే చంద్రబాబుతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేసిన పురందేశ్వరి కేవలం ఆరు ఎంపి, పది ఎమ్మెల్యే స్ధానాలకే ఒప్పుకున్నారు. ఆ తర్వాత టిక్కెట్ల కేటాయింపులో సీనియర్లకి ప్రాధాన్యత ఇవ్వాలని సీనియర్ నేతలు ఢిల్లీ వరకు వెళ్లారు. విశాఖ ఎంపి స్ధానం కోసం రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు తీవ్రంగా ప్రయత్నించారు. అధిష్టానం ఆదేశాలతో జివిఎల్ విశాఖలోనే ఇల్లు కొనుక్కుని రెండేళ్ళుగా అక్కడే ఉంటూ పార్టీ పటిష్టతకు కృషి చేశారు. అయితే జివిఎల్ కి వెన్నుపోటు పొడుస్తూ తన సోదరుడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కోసం పురందేశ్వరి విశాఖ సీటుని వదులుకున్నారు.

అనకాపల్లి సీటు కోసం ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ కు చుక్కెదురైంది. అలాగే ఏలూరు సీటు కోసం దశాబ్ధ కాలంగా కష్టపడుతున్న తపనా చౌదరి ఎన్నో ఆశలు పెట్టుకుంటే కూటమి తరపున టిడిపి అభ్యర్ధిగా మాజీ మంత్రి యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ బరిలోకి దిగారు. రాజమండ్రిలో పుట్టి నాలుగున్నర దశాబ్దాలుగా బిజెపిలో పనిచేస్తున్న రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుని కాదని పురందేశ్వరి రాజమండ్రి నుంచి బరిలోకి దిగారు. హిందూపూర్ ఎంపి లేదా కదిరి అసెంబ్లీ స్ధానం కోసం ప్రయత్నించిన మరో సీనియర్ నేత విష్టువర్ధన్ రెడ్డికి కూడా అవకాశం దక్కలేదు. ఇలా బీజేపీని నమ్ముకుని దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్న నేతల్ని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అవకాశం ఇవ్వడం బిజెపిలో అంతర్గత కుమ్ములాటలకు కారణమైంది.

అనకాపల్లి ఎంపి స్ధానాన్ని స్ధానిక నేతకు ఇవ్వకుండా టిడిపి నుంచి బిజెపిలో చేరిన కడప జిల్లా వాసి సిఎం రమేష్‌కు కేటాయించడంతో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెంచిందని భావిస్తున్నారు. పోలింగ్ ముందు రోజు వరకు కూడా అనకాపల్లి ఎంపీ సీటు గెలుస్తామని డప్పు కొట్టుకున్న నేతలు పోలింగ్ ముగిసిన తర్వాత సైలెంట్‌ అయిపోయారు. సిఎం రమేష్ ని బరిలోకి దింపి తప్పు చేశామని బిజెపి పెద్దలు భావిస్తున్నారట. అసలు అనకాపల్లి సీటు కాకుండా విశాఖ సీటు తీసుకుని ఉంటే గెలుపుపై ధీమా ఉండేదని కూడా ఇపుడు గగ్గోలు పెడుతున్నారని టాక్. ఇక విజయవాడ వెస్ట్ నుంచి బ్యాంకుల్ని మోసం చేసిన సుజనా చౌదరిని రంగంలోకి దింపడం ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్ పంపేలా చేసిందంటున్నారు.

ఇక అనపర్తి, బద్వేలు లాంటి చోట్ల రాత్రికి రాత్రి టిడిపి నేతలను బిజెపిలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడంపైనా బిజెపి నేతలే అభ్యంతరం వ్యక్తం చేశారు. అనపర్తిలో మొదటగా మాజీ సైనికుడు శివరామకృష్ణంరాజుకి కేటాయించారు. తర్వాత ఆ సీటుని అనపర్తి టిడిపి ఇన్ చార్జి నల్లమిల్లి రామకృష్ణరెడ్డిని స్వయంగా పురందేశ్వరి తన కారులోనే విజయవాడ బిజెపి కార్యాలయానికి తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుని అప్పటికపుడు టిక్కెట్ ప్రకటించారు. కేవలం తన గెలుపుకోసమే పురందేశ్వరి ఈ విధంగా చేశారని బిజెపి సీనియర్లు మండిపడ్డారు. ఇక బద్వేలులో కూడా టిడిపి ఇన్ చార్జి రోషన్ ని బిజెపిలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చారు. ఈ రెండు సీట్ల విషయంలోనూ రాష్ట్ర బిజెపి సీనియర్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి