చంద్రబాబు, పవన్ రియాల్టీ చెక్

By KTV Telugu On 1 June, 2024
image

KTV TELUGU :-

కౌంటింగ్ కు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉంది. కూటమి  నేతల విదేశీ పర్యటనలు కూడా ముగిసిపోయాయి. విజయావకాశాలు మెండుగా ఉన్నాయని తెలియడంతో  కూటమి నేతలు భవిష్యత్ కార్యాచరణలో పడిపోయారు. ఇందుకోసం చంద్రబాబు,  పవన్ భేటీ కాబోతున్నారు. తమను గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమానికి చేయాల్సిందేమిటో చర్చించబోతున్నారు. జగన్ చేసిన అరాచకం నుంచి ప్రజలను బయటపడేసేందుకు అమలు చేయాల్సిన ప్రణాళికలపై ప్రాథమికంగా కూడా చర్చించబోతున్నారు….

గ్రౌండ్ రియాల్టీ నేతలకు తెలిస్తే సరిపోదు.  ప్రజలకు కూడా తెలియాలి. ఆ దిశగానే అడుగులు వేసి  జనానికి అన్ని విషయాలు తెలియజేయడంలో కూటమి నేతలు సక్సెస్ అయ్యారు. అందుకే పోలింగ్ ముగిసిన వెంటనే  నేతలు విజయోత్సాహం కనిపించింది. కొన్ని రోజులు సేద దీరేందుకు చంద్రబాబు ఫ్యామిలీ, పవన్ కల్యాణ్ కుటుంబం  విదేశీ పర్యటనలకు వెళ్లిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు మే 19 నుంచి 28 దాకా అమెరికా టూర్ లో ఉన్నారు అని ప్రచారంలో ఉంది. ఆయన అనేక దేశాలు తిరిగి వచ్చారని వైసీపీ విమర్శలు చేసింది. మొత్తానికి చూస్తే బాబు 29న హైదరాబాద్ లోని తన ఇంటికి చేరుకున్నారు. పవన్ కల్యాణ్ కూడా ఫారిన్ టూర్ ముగించుకుని హైదరాబాద్ వచ్చేశారు. ఇకపై వారిద్దరూ మంగళగిరిలోని  తమ కార్యాలయాల్లో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటారు. కౌంటింగ్  విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వైసీపీ నేతలు అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని చంద్రబాబు ఇప్పటికే తమ శ్రేణులను హెచ్చరించారు. ప్రతీ కార్యకర్త ఉదాసీనతకు తావివ్వకుండా పనిచేయాలన్నారు.

చంద్రబాబు, పవన్ ఈ నెల 31న భేటీ కాబోతున్నారు. పోలింగ్ తర్వాత వారిద్దరూ భేటీ కావడం ఇదే మొదటి సారి అవుతుంది. పోలింగ్ తీరు కూడా వారి మధ్య సమీక్షకు వస్తుంది. జగన్ ఐదేళ్ల పాలనలో జరిగిన తప్పులు, తాము  చేయాల్సిన పనులపై కూడా ఒక అవగాహనకు వస్తారు…

ఏపీలో సీఎం జగన్ మాఫియా రాజ్యం నడిపించారు. అక్రమాలు, కబ్జాలు, దోపిడీలు నిత్యకృత్యమయ్యాయి. సహేతుకమైన ఆర్థిక విధానాలు లేక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఉద్యోగులకు సకాలంలో  జీతాలు, పెన్షన్లు అందించలేని పరిస్థితి కూడా చాలా కాలంగానే ఉంది. వీటన్నింటినీ సరిదిద్దాల్సిన బాధ్యత ఇప్పుడు చంద్రబాబు, పవన్ పై పడింది. ఇసుకాసురులు, మైనింగ్ దొంగలను దారితీసుకురావాలి. ల్యాండ్, శాండ్, మైనింగ్ వ్యవహారాలను తేల్చాలి. అందుకే అధికారానికి వచ్చిన వెంటనే ఇసుకను ఫ్రీగా ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీని వల్ల అక్రమాలు చాలా వరకు తగ్గుతాయి. ఫ్రీ స్కీము ఎప్పటి నుంచి అమలు చేయాలి, దానికి ఏమైనా పరిమితులు విధించాలా లాంటి  అంశాలను ఇద్దరు నేతలు చర్చించనున్నారు. పెన్షన్లు పెంచుతామని, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కూడా చంద్రబాబు ప్రకటించి చాలా రోజులైంది. అందుకు నిధుల సమీకరణపై  దృష్టి పెట్టే అంశం కూడా చర్చకు వస్తుంది. రాష్ట్ర అప్పుల ప్రభావం జీతాలు, పెన్షన్లపై పడకుండా ప్రతీ నెల  ఒకటో  తారీఖునే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడేందుకు ఎలాంటి  చర్యలు తీసుకోవాలో చర్చించాలి. అప్పుల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కూడా పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నేతలపైనే ఉంది. మరో పక్క అధికారానికి రాగానే మెగా డీఎస్సీని ప్రకటిస్తామని చెప్పారు. ఆ విషయంలో ఎలాంటి అవరోధాలు లేకుండా చర్యలు తీసుకోవాలని తీర్మానిస్తారు….

చంద్రబాబు, పవన్ ముందు పెద్ద అజెండానే ఉంది. అన్ని ఒక రోజులో పూర్తయ్యే పనులు కాదు. వాటిని  దశలవారీగా పూర్తి చేయాలన్న సంగతి వారిద్దరికీ తెలుసు. 31న జరిగే భేటీ.. ఆరంభం మాత్రమే. రాష్ట్ర ప్రగతికి బీజం వేసే చర్యగా ఆ మీటింగును పరిగణించాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి