చంద్రబాబులో అయితే దేవుడు అయినా ఉండాలి లేదంటే దెయ్యమైనా చొచ్చి ఉండాలి. కష్టాల్లో ఉన్నామని ఒక మహిళ అనగానే జనాల ముందే రెండున్నర లక్షలు తీసి చేతిలో పెట్టాడు. ఇక వర్షానికి ధాన్యం రాలిపోతుందని అనగానే ముందే పసిగట్టి నేను పంటను కాపాడుతానని అంటున్నాడు. ఇదంతా చూసినా జనాలు చంద్రబాబు దేవుడా దెయ్యమా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జనాల ముందర చేసే జిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు. ఆయన తిమ్మిని బమ్మిని చేయగలరు. మీడియా ముందర ఎన్నో ఎకసెక్కాలు ఆడగలరు. అలాంటి జిత్తులమారి చంద్రబాబు మళ్లీ మొదలుపెట్టాడు. తాజాగా ఏపీలో పర్యటిస్తుండగా తన వ్యాన్ మీద ఒక మహిళను ఎక్కించుకున్నాడు. ఆమెకు ఎంత ట్రెయినింగ్ ఇచ్చారో తెలియదు కానీ ఆమె మరిచిపోయింది.
తన బిడ్డను చదివించుకోలేకపోతున్నానని ఫీజు కట్టాలంటూ ఓ మహిళ వాపోయింది. నీ కూతురు ఫీజు ఎంత అని ఆ మహిళను చంద్రబాబు అడుగుతాడు. దానికి ఆమె బిత్తర చూపులు చూస్తుంది. ఎంతో మరిచిపోతుంది. కిందనున్న తన వాళ్లను అడుగుతుంది. అప్పుడు రూ.2.30 లక్షలు అంటుంది. అప్పుడు సడెన్ గా చంద్రబాబు తన జేబులోంచి రూ.2.30 లక్షలు తీసి ఇచ్చేస్తాడు. అప్పటికప్పుడు చంద్రబాబు జేబులో అంత డబ్బు ఎందుకు పెట్టుకున్నాడు ఆమె కష్టాలు విని అంత సడెన్ గా ఎలా తీసిచ్చాడన్నది బ్రహ్మరహస్యం. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు ముందే పక్కా ప్లాన్ ప్రకారమే చేసి జనాల చెవుల్లో పిచ్చి పూలు పెట్టాడని చెప్పొచ్చు. చంద్రబాబు టీడీపీ నేతలు అప్పటికే ఆమెకు ట్రెయినింగ్ ఇచ్చినా కూడా ఆమె మరిచిపోయింది. కిందనున్న ఆమె గుర్తు చేయగానే రూ.2.30 లక్షలు అంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడే చంద్రబాబు టీడీపీ నేతలు దొరికిపోయారు. తానే ఒక విద్యార్థి చదువుకు రూ.2.30 లక్షలు ఇచ్చినట్టు కలరింగ్ ఇచ్చి మీడియా ముందర ప్రజల ముందర గొప్పలకు పోతున్నట్టు చంద్రబాబు బిల్డప్ ఇచ్చేశాడు. ఇదే ఇప్పుడు బూమరాంగ్ అయిపోయింది.