అవినీతిపరులు అరాచకవాదులను వదిలేది లేదన్న చంద్రన్న

By KTV Telugu On 18 September, 2024
image

KTV TELUGU :-

చంద్రబాబు నాలుగో సారి అధికారానికి వచ్చి తన మార్కు పాలనను చూపిస్తున్నారు. ఆయన మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 20న కూటమి ప్రభుత్వ వంద రోజుల పాలన పూర్తవుతోంది. ఎక్కడా ఉదాసీనతకు, ఆశ్రిత పక్షపాతానికి అవకాశం ఇవ్వకుండా అందరనీ సమన్వయం చేసుకుంటూ చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిన వ్యవస్థలను ఆయన గాడిలో పెడుతూ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి తన రెండు కళ్లు అని చెప్పుకునే చంద్రన్న.. ఐదేళ్ల దురవస్థ నుంచి రాష్ట్రాన్ని బయటపడేసే పనిలో ఉన్నారు.దెబ్బతిన్న రాజధాని అమరావతికి మళ్లీ పునరుజ్జీవం కల్పించే దిశగా భారీ అడుగుల పడుతున్నాయి. ముళ్ల కంచెలుగా పెరిగిపోయిన అమరావతి ప్రాంతాన్ని శుభ్రపరిచి.. అక్కడ కొత్త కట్టడాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. అమరావతిలో భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని అధికారులను చంద్రబాబు స్వయంగా ఆదేశించారు.పైగా ఇసుక ఉచితం, కేవలం రవాణా ఛార్జీలు చెల్లిస్తే చాలన్న నిర్ణయం ప్రతీ సామాన్యుడికి ఊరట కలిగించే నిర్ణయంగా చెప్పుకోవాలి. మద్యం వ్యాపారంలో అడ్డగోలు బ్రాండ్లకు చెల్లుచీటీ పాడటం ద్వారా ప్రజల ఆరోగ్యాలను కాపాడగలిగారు.

అయిదేళ్లలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు 4వ సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు శ్రమిస్తున్నారు.గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి దారిలో పెట్టేందుకు ఒక్క క్షణం కూడా విశ్రమించకుండా పని చేస్తున్నారు. పాలనలో తనదైన మార్క్‌ను చూపిస్తూ నిర్వీర్యమైన వ్యవస్థలను సరి చేస్తున్నారు. ప్రభుత్వమే లేదు అనే పరిస్థితిని మార్చి… ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నారు.మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు, సంక్షేమ ఫలాలు, అభివృద్దికి అడుగులు వేసింది.
చంద్రబాబు అనుభవం ముద్ర కనిపించింది. ప్రభుత్వ వ్యవస్థలో మార్పు మొదలైంది. ప్రజల జీవితాలలో వెలుగు… ప్రభుత్వంపై నమ్మం కనిపిస్తోంది. వ్యవస్థలను గాడిన పెడుతున్నారు. ప్రక్షాళన మొదలు పెట్టారు.రాష్ట్రంలో అశాంతి లేదు… అధికార అహంకారానికి చోటు లేదు… ఆకృతాయలకు స్థానం లేదు… హంగామా, హడావుడి లేనే లేవు. సింపుల్ గవర్నమెంట్… ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది కనిపిస్తోంది.పరదాలు, బారీకేడ్లు, చెట్లు కొట్టేయడాలు లేనే లేవు. అధికారం అంటే పదవి కాదు… బాధ్యత అని చాటిన నిజమైన ప్రజాప్రభుత్వంలా వంద రోజుల పాలన సాగింది..

వైసీపీ హయాంలో అవినీతికి పాల్పడిన వాళ్లు ఇప్పుడు కలుగులో దాక్కునే పరిస్థితి వచ్చింది. వారిని చట్టం ముందు నిలబెట్టి..అవినీతి చేసే వారికి వణుకు పుట్టుంచే ప్రక్రియ మొదలైంది. మరో పక్క ఐదేళ్ల పాటు కక్షసాధింపుకు దిగిన వారిని సైతం దారికి తీసుకువస్తున్నారు. సామాజిక పెన్షన్ల పెంపు ద్వారా చంద్రబాబు మా సొంత బిడ్డ అని జనంతో చెప్పించగలిగారు. వైసీపీ హయాంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు నెల మొదటి రోజునే ఉద్యోగులు, టీచర్లకు జీతాలిస్తున్నారు. చంద్రబాబు అధికారానికి వచ్చిన రెండు నెలలకే బుడమేరు గట్లు తెగాయి, కృష్ణానదికి వరదలు వచ్చాయి.ఐనా చంద్రబాబు ఎక్కడా ఉదాసీనతకు అవకాశం ఇవ్వలేదు. ఇంటికి కూడా వెళ్లకుండా జనంలోనే ఉంటూ వరద సహాయ చర్యలు చేపట్టారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచారు. ప్రతీ ఒక్క బాధితుడికి సాయం అందుతుందన్న భరోసా ఇచ్చారు…

అధికారానికి వచ్చిందే తడవుగా కొందరు ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్న తీరు చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లింది. వారికి ఇప్పటికే వార్నింగులు వెళ్లాయి. ఇప్పుడు మరోసారి చంద్రబాబు స్వయంగా పిలిపించి మాట్లాడబోతున్నారు. కొందరిపై కఠిన చర్యలు ఖాయమంటున్నారు. ఎవరైనా తప్పుచేస్తే వెంటనే సస్పెండ్ చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. దారికి రాని వారిని పార్టీ నుంచి సాగనంపడానికి వెనుకాడబోమని సంకేతాలివ్వబోతున్నారు…దటీజ్ చంద్రబాబు….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి