రాజకీయం ఒక వ్యసనం లాంటింది. సిగిరెట్, డ్రగ్స్ అలవాటైనా మానుకోవచ్చు.. రాజకీయం అలవాటైతే మాత్రం మానుకోలేరంటారు. ఎన్ని సార్లు ఓడిపోయినా మరో సారి ట్రై చేసి చూడాలనిపించే రంగాల్లో రాజకీయం కూడా ఒకటే. 2019లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ పవన్ కల్యాణ్ మళ్లీ నిలదొక్కుకుని పోటీ చేస్తున్న తీరు రాజకీయానికి ఉన్న కరిష్మా, పవర్ రెండింటికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన అన్నయ్య చిరంజీవికి కూడా ఇంకా ఆశలున్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి, జనసేనకు ఆయన ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం కూడా ఆ దిశగానే చూడాలని విశ్లేషణలు వినిపిస్తున్నాయి…
చిరంజీవి వెళ్లి పవన్ కల్యాణ్ ను కలిశారా.. పవన్ వెళ్లి చిరంజీవిని కలిశారా.. అన్నది అప్రస్తుతం. వారిద్దరూ కలిసినప్పుడు జరిగిదేమిటనేదే హాట్ టాపిక్. పైగా మెగాస్టార్ ఐదు కోట్ల విరాళాన్ని ఒక రాజకీయ పార్టీకి ఇవ్వడం మరో హైలైట్. తమ్ముడి పార్టీకి అన్న విరాళం ఇవ్వడంలో విశేషం ఏముంది అనిపించవచ్చు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో దీన్ని ఒక కీలక పరిణామంగానే చూడాలి. నిజానికి చిరు ఇచ్చింది కేవలం విరాళం కాదు.. ఒక పెద్ద స్టేట్మెంట్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మెగా అభిమానుల్లోనే ఇప్పుడు రకరకాల వర్గాలు ఏర్పడ్డాయి.చిరు అభిమానుల్లో ఓ వర్గం పవన్‌ను వ్యతిరేకించడం.. పవన్ ఫ్యాన్స్‌లో కొందరు చిరును రాజకీయంగా విమర్శించడం లాంటివి చేస్తుంటారు. మరోవైపు చిరు గతంలో ఏపీ సీఎం జగన్‌తో సన్నిహితంగా వ్యవహరించడం చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో మెగా అభిమానులందరూ విభేదాలను పక్కన పెట్టి.. ఏకతాటిపై నడవాలని చిరు చెప్పకనే చెప్పినట్లు అయింది.జనసేనకు మెగా అభిమానుల నుంచి సంపూర్ణ మద్దతు రాబట్టడమే చిర-పవన్ భేటీకి, చిరు భారీ విరాళం ప్రకటించడానికి కారణంగా స్పష్టమవుతోంది. అభిమానుల్లో వర్గాల వల్ల ఓట్ల చీలిక జరిగి వైసీపీకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో తాను తమ్ముడికి పూర్తిమద్దతు ప్రకటించడం ద్వారా మెగా అభిమానులు కూడా పూర్తగా పవన్‌కు అండగా నిలవాలని చిరు సంకేతాలు ఇచ్చారని స్పష్టమవుతోంది. చిరంజీవి దీన్నొక కార్యక్రమం లాగా చేశారు. పవన్‌కు ఆర్థికంగానే కాక అన్ని రకాలుగా తన మద్దతు ఉందని స్పష్టం చేశారు.
పవన్ అనుకున్నది సాధించే లక్షణం ఉన్న వ్యక్తి అని, సాధించి తీరుతారని చిరంజీవి చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఈ క్రమంలో చిరంజీవికి కూడా కొన్ని ఆంకాంక్షలున్నట్లే అనుకోవాలి. మెగాస్టార్ కూడా మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. జగన్ పిలిచి మళ్లీ తనకు పట్టించుకోలేదని కూడా చిరంజీవి అసంతృప్తిగా ఉన్నట్లు వినిపిస్తోంది. రండి ఆచార్యా అని పిలవడమే గానీ, చేసిన ప్రయోజనమేమి లేదని కూడా అంటున్నారు…
ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి ప్రారంభించినప్పుడు అనూహ్య స్పందనే వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి రాకపోయినా ప్రభావవంతమైన పార్టీగానే పీఆర్పీ నిలబడింది. తర్వాతి పరిణామాల్లో పార్టీ వీకైపోయినా.. అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ లో కలిపేసి చిరంజీవి కేంద్ర మంత్రి పదవి తీసుకున్నా.. ఆయనకున్న ప్రత్యేకత మాత్రం తగ్గలేదు. పాత పీఆర్పీ అభిమానులు ఇంకా చిరంజీవిపై ఆశలు పెట్టుకునే ఉన్నారు. పీఅర్పీని పునరుద్ధరిస్తే తప్పేమిటని ప్రశ్నించే వాళ్లూ ఉన్నారు. అయితే ప్రస్తుత పరిస్తితుల్లో ఆ పని కుదరకపోవచ్చన్న సంగతి తెలిసినందునే… మెగాస్టార్, ఇప్పుడు జనసేన రూట్లోకి రావాలని కోరుకుంటున్నట్లుగా ఒక టాక్. అది నిజమో లేదో తెలీదు కానీ,, మెగాభిమానులకు మాత్రం చిరంజీవి మళ్లీ రావాలన్న కోరిక ఉంది. ఏపీలో ఎన్డీయే గెలిస్తే ఆ అవకాశాలు మెరుగుపడే వీలుంది. పైగా ప్రధానమంత్రి మోదీకి కూడా చిరంజీవి అంటే అభిమానమే… బీజేపీ అనుబంధ సభ్యుడిగా కూడా ఆయనకు ఏదోక పదవి ఇచ్చే అవకాశాలున్నాయి…
నిజానికి చిరంజీవి నిత్య కృషీవలుడు. ఇప్పటికీ కూడా సినిమాల్లో నటిస్తున్నారు. డబ్బు కోసం కాకపోయినా తన ప్యాషన్ కోసం ఆయన మేకప్ వేసుకుంటారు. ప్రజా సేవ కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన సందర్భం ఉంది. అందుకే ఆయన పార్టీ పార్టీ పేరు కూడా ప్రజారాజ్యం అని పెట్టారు. మరి చిరంజీవి అసలు మూవ్స్ ఏమిటి.. ఆయన రేపు ఏమి చేస్తారో.. తర్వలోనే తెలస్తుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…