పాపం పెద్దకొడుకు..!

By KTV Telugu On 27 May, 2024
image

KTV TELUGU :-

టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన ప్రస్ట్రేషన్ బయట  పడకుండా జాగ్రత్త పడుతున్నారనిపిస్తోంది. ఏది ఆశించినా సాధ్యం కాకపోవడం, పార్టీ తనను పట్టించుకోకపోవడం కారణంగా వెంకన్న ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. నారా లోకేష్, టీడీపీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని  ఆయన డిమాండ్ చేస్తున్నారు. పైగా  అలా డిమాండ్ చేసే హక్కు తనకు ఉందని కూడా వెంకన్న అంటున్నారు..అలాంటి అరుపులు అదే విజ్ఞప్తులు చంద్రబాబు, లోకేష్ చెవికి చేరతాయో లేదో కూడా అనుమానమే…

రోజు ఏదో విధంగా హడావుడి చేయగల విజయవాడ నాయకుడు బుద్దా వెంకన్న. వార్తల్లో ఉండటమంటే ఆయనకు చాలా ఇష్టం. అప్పుడెప్పుడో ఎమ్మెల్సీగా చేసిన అనుభవం మినహా ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి  పదవి లేదు. పార్టీ ప్రతినిధిగా రోజువారీ మీడియా  ముందు ఏదోకటి మాట్లాడటం మినహా ఈ మధ్య కాలంలో ఆయన సాధించింది కూడా ఏమీ  లేదు.టీడీపీలో  ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగంపడిన  పలువురు లీడర్స్ లో ఆయన కూడా ఒకరని చెప్పక తప్పదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏమైనా అందుతుందా అంటే ఆ విధంగా కూడా ఆశలు లేకుండా పోతున్నాయని చెబుతున్నారు. ఆ నేపథ్యంలో తను లైమ్ లైట్లో ఉండేందుకు, తనకు ఏదోక  పదవి లభించేందుకు బుద్దా సరికొత్త జిమిక్కులు చేస్తూ వస్తున్నారు. ఇటీవల ఆయన తన రక్తంతో ఏదేదో రాసేశారు. ఐనా ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఇప్పుడు తాజాగా నారా లోకేష్ రూట్లో ఏదో నరుక్కుంటూ  వస్తున్నారు…

నారా లోకేష్  పార్టీ పగ్గాలు చేపట్టాల్సిన టైమ్ వచ్చేసిందని వెంకన్న ప్రకటించేశారు.చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆ పని జరిగిపోవాలని వాదిస్తున్నారు. పైగా చంద్రబాబు ఆత్మకథను పుస్తక రూపంలో తీసుకువాలని కూడా ఆయన కోరుతున్నారు…

టీడీపీ అధినేత చంద్రబాబు క‌నుక త‌న ఆత్మ‌క‌థ‌ను పుస్త‌కం రూపంలో తీసుకువ‌స్తే.. దానిలో త‌న‌కు ఒక పేజీని ఖ‌చ్చితంగా కేటాయిస్తార‌ని..  బుద్దా వెంక‌న్న వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు ఆత్మ‌కథ‌ను పుస్తకం రూపంలో తీసుకురావా లని తాను కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. చంద్ర‌బాబుకు తాను పెద్ద‌కొడుకు వంటి వాడిన‌ని చెప్పారు. పార్టీ కోసంచంద్ర‌బాబు రాష్ట్రంలో క‌ష్ట‌ప‌డ్డార‌ని.. తాను విజ‌య‌వాడ‌లో పార్టీకోసం ప‌నిచేశాన‌ని అన్నారు.పార్టీ క‌ష్ట కాలంలో ఉన్న‌ప్పుడు.. తాను కేసులు కూడా పెట్టుకుని పార్టీ కోసం ప‌నిచేసిన‌ట్టు బుద్దా వెంక‌న్న అన్నారు. అందుకే చంద్ర‌బాబు ఆత్మ‌క‌థ పుస్త‌కంలో త‌న‌కంటూ.. ఒక పేజీని ఖ‌చ్చితంగా ఉంచుతార‌ని.. దానిలో త‌న‌కు-చంద్ర‌బాబుకు మ‌ధ్య ఉన్న ఆత్మీయ సంబంధాన్ని వివ‌రిస్తార‌ని చెప్పారు. ఇదిలావుంటే.. చంద్రబాబు ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ కోసం ఒంటి చేత్తో పోరాటం చేశార‌ని.. కానీ, ఇప్పుడు పార్టీకి ముగ్గురు జ‌మా జ‌ట్టీల్లాంటి నాయ‌కులు ల‌భించార‌ని తెలిపారు.నారా భువ‌నేశ్వ‌రి, నారా లోకేష్‌, నారా బ్రాహ్మ‌ణిలు ఇక నుంచి పార్టీని కాపాడుకునేందుకు ముందుకు రాను న్న‌ట్టు చెప్పారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ వీరు ప్ర‌చారం చేశార‌ని అన్నారు. వ‌చ్చే ఫ‌లితాలు కేవ‌లం టెక్ని క‌ల్ మాత్ర‌మేన‌ని.. కూట‌మికి 130 సీట్లు ఖ‌చ్చితంగా వ‌స్తాయ‌ని.. వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కే అవ‌కాశం లేద‌ని బుద్ధా చెప్పుకొచ్చారు.అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజే టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా నారా లోకేష్  బాధ్యతలు చేపట్టాలని బుద్దా వెంకన్న కోరుతున్నారు. పైగా అది తన డిమాండ్ అని కూడా చెబుతున్నారు. పార్టీ భవిష్యత్తు కోసం సర్వతమే ఈ నిర్ణయం తీసుకోవాలని ఆయన అంటున్నారు.  పార్టీలో  అత్యధిక శాతం మంది నారా లోకేష్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వెంకన్న జోస్యం చెప్పారు….

ఏదో  విధంగా ఒక పదవిని పొందాలని బుద్దా వెంకన్న కోరుకుంటున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే అధినేత కుటుంబానికి సోప్ వేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే వెంకన్న మాత్రం తాను ఏ పదవిని కోరుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని అంటున్నారు. ఐనా రాజకీయాల్లో ఉన్న వాళ్లు పదవులు లేకుండా ఎలా ఉంటారు.. దాని గురించి పెద్దగా చెప్పాల్సింది ఏముంటుంది….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి