జమిలీపై మైండ్ గేమ్ మొదలెట్టిన వైసీపీ…

By KTV Telugu On 16 October, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రెండు మూడు సంవత్సరాలే మనుగడు సాగిస్తుందా. కొందరు ఆశావహులు ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నారు.ప్రస్తుతం ఇదో పెద్ద టాపిక్. 2026 ఆఖర్లో లేదా 2027 మొదట్లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని చెప్పుకుంటూ కొందరు రోడ్ల వెంబడి తిరుగుతున్నారు.పైగా చంద్రబాబు ప్రభుత్వం దిగిపోవడం ఖాయమని ఇప్పటికే ప్రజావ్యతిరేకత మూటగట్టుకుందని కూడా ఉదరగొడుతున్నారు. దానికి వాళ్లుచెబుతున్న రీజనేంటో తెలుసా. జమిలీ ఎన్నికలు అన్న ఒక టాపిక్.

నిజానికి షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు 2029లో జరిగాలి. లోక్ సభకు కూడా అప్పుడే జరుగుతాయి. కాకపోతే జమిలీ ఎన్నికలు జరిగితే కాస్త ముందు లేదా కాస్త వెనుకా జరిగే వీలుండొచ్చు. అదీ కూడా జమిలీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలి. ప్రచారకర్తలకు ఆ సంగతి అవసరం లేదట. ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయాలి, చంద్రబాబు ఓడిపోతున్నారని ప్రచారం చేయాలి అంతే.

నిజానికి వన్ నేషన్ వన్ పోల్ పేరుతో జమిలీ ఎన్నికల దిశగా కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రధాని మోదీ, ఆయన అనుచరులు కూడా జమిలీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దానికి సంబంధించిన బిల్లును ప్రవేశ పెడతారు. రాజ్యంగ సవరణ చేసేందుకు కూడా బీజేపీ సిద్ధంగా ఉంది. ఇవన్నీ జరిగిన తర్వాతే లోక్ సభకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి ఒకే సారి ఎన్నికలు జరిగే ప్రక్రియను ప్రారంభిస్తారు.దానికి సంబంధించిన సిబ్బంది, మౌలిక సదుపాయాలను కూడా లెక్కచూసుకుని…ఎక్కడ ఎంతమంది ఉన్నారో బేరీజు వేసుకున్న తర్వాతే ముందుకు సాగే అవకాశం ఉంటుంది. పైగా అన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఉన్నాయా లేదా అన్నది కూడా చూసుకోవాలి. ఈవీఎంలు ఆర్డరిచ్చి రెడీ చేయించాలి. భద్రతా సిబ్బంది సరిపోతారా..లేనిపక్షంలో ఏం చేయాలి… వారిని తరలింపులు ఎలా అన్నది కూడా చూడాలి.. ఇదంతా జరిగితే 2028 చివర్లో జమిలీ జరిగే అవకాశం ఉంది. లేని పక్షంలో కాస్త లేటు కూడా కావచ్చు. ఆ మొత్తం వ్యవహారాన్ని వదిలేసి…ఇప్పుడు కేవలం చంద్రబాబు ముందే దిగిపోతారన్న ప్రచారానికి మాత్రమే తెరతీశారు..

చంద్రబాబుకు టైమ్ తక్కువ ఉందని ప్రచారం చేయడమే వారి ఉద్దేశం కావచ్చు. రెండు మూడు సంవత్సరాల్లో ఎన్నికల హామీలను అమలు చేయలేరని ఇప్పటి నుంచే భయపెట్టే ఉద్దేశం వారిలో ఉండొచ్చు. అమరావతి పూర్తి కాదని, పోలవరం మళ్లీ అటకెక్కుతుందని చెప్పేందుకు ప్రయత్నించొచ్చు. ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు అవుతాయన్న హెచ్చరికలకు శ్రీకారం చుట్టొచ్చు. ఎన్నికలకు భయపడే ఇసుక, మద్యంలో ఇప్పటి నుంచి దందాలు సాగిస్తున్నారని జనంలోకి తీసుకెళ్లాలన్న ఆలోచన ఉండొచ్చు. ఏదో విధంగా టీడీపీ నేతృత్వ కూటమిపై వత్తిడి ఉంచడమే వైసీపీ బ్యాచ్ ప్రధాన లక్ష్యం కావచ్చు..

వైసీపీ నేతలు ఇప్పటికే హడావుడి మొదలెట్టేశారు. నెల్లూరు నేత మాజీ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి ఇప్పుడు అధికారులను బెదిరిస్తున్నారు. రెండేళ్లతో జమిలీ ఎన్నికలు వస్తాయని, చంద్రబాబు దిగిపోతారని చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబును నమ్ముకుని ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి వచ్చి వాళ్ల సంగతి చూస్తామని హెచ్చరిస్తున్నారు. రెండు సంవత్సరాల్లోనే సీన్ మారిపోతుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పుకొస్తున్నారు. కాకాని లాంటి వాళ్ల మాటలు నిజమేనని నమ్మి జగన్ పగటి కలలు కంటున్నారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.వాళ్ల ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి