ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీ మేరకు.. మహిళల కు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసింది ఏపీ గవర్నమెంట్. ఈ మేరకు ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్వీట్ చేశారు. ఈ పథకం అమలుకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వంలో మరో సంక్షేమ నిర్ణయం అంటూ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన వివరాల్ని వెల్లడించారు.
రాష్ట్రంలో మహిళలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆగష్టు 15 నుంచి ఏపీలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్వీట్ చేశారు. ప్రజా ప్రభుత్వంలో మరో సంక్షేమ నిర్ణయం.. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ ట్వీట్ చేశారు.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది. ఏపీకి చెందిన అధికారులు ఈ రెండు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ పథకం అమలవుతున్న తీరును పరిశీలించారు. ప్రధానంగా జీరో టికెట్ విధానంపై రెండు రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు అధికారులు. ఇక ఏపీలో ఉన్న పరిస్థితులు, రూట్లకు అనుగుణంగా ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలనే అంశంపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ప్రాథమికంగా ఓ నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.. అయితే తెలంగాణలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానమే సరిపోతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ప్రధానంగా నడుస్తున్నాయి.
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో సిటీ ఆర్డీనరీ బస్సులు, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. అలాగే ఈ ఉచిత ప్రయాణం కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా?.. ఉమ్మడి జిల్లాల పరిధిలో అనుమతిస్తారా అనే అంశాన్ని ఇంకా నిర్ణయించాల్సి ఉంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…