ఆంధ్ర ప్రదేశ్ వాలంటీర్ వ్యవస్థకు గుడ్ న్యూస్

By KTV Telugu On 5 July, 2024
image

KTV TELUGU :-

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా.. లేదా?. ఆంధ్రప్రదేశ్లో  కొద్దిరోజులుగా  ఇదే చర్చ జరుగుతోంది. జులై నెల పింఛన్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించడంతో వాలంటీర్ల కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

చంద్రబాబు గవర్నమెంట్ వాలంటీర్ల అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ వ్యవస్థపై కొన్ని మార్పులు, చేర్పులు చేసే దిశగా అడుగులు వేస్తోంది. త్వరలోనే మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు… జులై నెల పింఛన్ డబ్బుల్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించడంతో.. వాలంటీర్లను కొనసాగించడం అనుమానమే అంటూ వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. ఏపీ ప్రభుత్వం మాత్రం వాలంటీర్ల విషయంలో కచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటామంటోంది.. వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే నిర్ణయం ఉంటుందనే అభిప్రాయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో వాలంటీర్ల అంశంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవస్థలు చేయాల్సిన మార్పులు, చేర్పులపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాలంటీర్ల ఉద్యోగాన్ని కొంత నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలనే ఆలోచన ఉందట. ప్రతి మూడేళ్లకు ఒకసారి కొత్తగా వాలంటీర్లను నియమించాలనే ప్రతిపాదనలు ఉన్నాయంటున్నారు. అంటే మూడేళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించకూడదని భావిస్తున్నారట. అంటే మూడేళ్లకు ఒకసారి వాలంటీర్ల నియామకం చేపట్టాలనే ఉద్దేశం ఉందట.

వాలంటీర్లకుగా ఉద్యోగాలు చేసేవారికి ఈ మూడేళ్లలలో ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇవ్వాలని.. ఆ తర్వాత వారు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించాలని భావిస్తున్నారట. ఈ మేరకు వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు చేయాలనుకుంటున్నారట. వాలంటీర్ల విషయంలో ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకోవాలని.. ఆ తర్వాత మార్పులు, చేర్పులపై ఒక నిర్ణయానికి వచ్చే ఆలోచన ఉందంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన కసరత్తు మొదలు పెట్టి..

వాలంటీర్ల పేర్లను కూడా మార్చే ఆలోచన కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. వాలంటీర్లను ఇకపై గ్రామ సేవక్‌, వార్డు సేవక్‌గా పేరు మార్చాలనే ఆలోచన కూడా ఉందట. వాలంటీర్లను స్థానిక సంస్థల పరిధిలోక తీసుకొచ్చి.. వారికి కొన్ని బాధ్యతల్ని అప్పగించాలని భావిస్తున్నారట. రాష్ట్రవ్యాప్తంగా పథకాల లబ్ధిదారులకు డబ్బులు పంపిణీ చేసే విధులతో వాలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలనే ఆలోచన కూడా ఉందంటున్నారు. అలాగే వాలంటీర్లకు జీతాన్ని రూ.10వేలకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నారట. గత ప్రభుత్వం ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించగా.. కూటమి ప్రభుత్వం‌ఇకపై ప్రతి వంద ఇళ్ల బాధ్యతలు ఒకరికి అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు.

గత ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది.. వీరి సాయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పథకాలను పంపిణీ చేశారు. పింఛన్‌ పంపిణీతో పాటుగా ఇతర పథకాలకు సంబంధించిన అంశాలను వాలంటీర్లు పర్యవేక్షించారు. అయితే మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వాలంటీర్లను పింఛన్‌ల పంపిణీ నుంచి దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించింది. దీంతో మూడు నెలల పాటూ పింఛన్ల పంపిణీ అంశంపై కాస్త గందరగోళం కొనసాగింది. వాలంటీర్ల బదులు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పింఛన్‌ను ఇంటంటికి పంపిణీ చేయాలని టీడీపీ కోరింది. అయితే అప్పటి ప్రభుత్వం మాత్రం ఒక నెల సచివాలయాల్లో పంపిణీ చేయగా.. మరో రెండు నెలలు బ్యాంక్ అకౌంట్‌లో జమ చేసింది. జులై నెలలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పంపిణీ చేయించింది. మరి కూటమి ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో మంచి  వార్త నే చెప్తారని అనిపిస్తుంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి