గుడ్డు మంత్రి, బ్యాడ్ టాక్

By KTV Telugu On 27 June, 2024
image

KTV TELUGU :-

ఆయన అసలు పేరు కంటే కొసరు పేరయిన గుడ్డు మంత్రితోనే చాలా ఫేమస్ అయ్యారు.ఉత్తరాంధ్రలో  ఏదో సాధిస్తారనుకుంటే అక్కడ వైసీపీని నేలకు  దించారు. ఎన్నికల్లో  ఓడిపోయిన తర్వాత అధికార ప్రతినిధి స్థాయిలో పార్టీని ఆదుకుంటారనుకుంటే ఆ సంగతి వదిలేసి పార్టీకి డేమేజ్ చేస్తున్నారు. ఏదో మాట్లాడేసి పార్టీని ఇరకాటంలో పడేస్తున్నారు. ఆయనే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏం  మాట్లాడతారో  ఆయనకే తెలీదు…..

ఒక మంత్రి స్థాయి అధికారి ఎలా మాట్లాడకూడదో  తెలుసుకోవాలంటే గుడివాడ అమర్నాథ్ ను చూడాల్సిందే. వైసీపీ  పాలనలో ఆయన ఏం చేశారోనని ఆలోచిస్తే ఆ  పనులు జనానికి అర్థమైతే ఒట్టు అన్నట్లుగా ఉంటుంది. రాజకీయంగా వేగంగా ఎదిగినప్పటికీ… రాజకీయ పరిణితి సాధించడంలో మాత్రం అంత వేగంగా  ఆయన ఎదగలేకపోయారు. జగన్ ను చూసినప్పుడల్లా మైమరచిపోవడం మినహా  ఆయన చేసిందేమీ లేదు. పరిశ్రమల మంత్రిగా ఆయన తెచ్చిన పరిశ్రమ  ఒకటీ లేదు. పైగా ఉన్న పరిశ్రమలను ఆయన వెళ్లగొట్టి చేతులు దులుపుకున్నారన్న అపవాదు కూడామూటగట్టుకున్నారు. ఇప్పుడేమో పిచ్చిపిచ్చిగా  మాట్లాడుతున్నారు….

మంత్రిగా పాజిటివ్  అభిప్రాయం కంటే… సోషల్ మీడియాలో ఆయనకు నెగిటివ్ టాక్ ఎక్కువగా విస్తరించింది. కింది స్థాయి నుంచి ఎదిగినా క్షేత్రస్థాయి పరిస్థితులు ఆయనకు తెలియవన్న ఫీలింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఆయన  లూజ్ టాక్ కారణంగా జనంలో బాగా పలుచనైపోతున్నారు…..

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న అమర్నాథ్ గ్రేటర్ విశాఖ కార్పొరేటర్ గా మాత్రమే అందరికీ తెలుసు. వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి పదవి దక్కించుకుని  యమజాతకుడనిపించుకున్నారు. జగన్  దగ్గర మంచి పేరు కొట్టేశారు. అయితే ఆయనకు తెలిసిందీ శూన్యమన్న టాక్ చాలా రోజులుగానే ఉంది. దానితో తెగ ట్రోలింగ్  అవుతుంటారు.  ఏపీలో పరిశ్రమలు లేకపోవడానికి గురించి స్పందిస్తూ ఓ సందర్భంలో ఆయన చెప్పిన కోడిగుడ్డు పురాణం సోషల్ మీడియాను షేక్ చేసింది. గుడివాడ అమర్నాథ్ కాస్త.. గుడ్డు అమర్నాథ్ గా మారిపోయారు. పరిశ్రమల శాఖ మంత్రిగా దావోస్  సదస్సుకు ఎందుకు వెళ్లలేదంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుందని చెప్పి తెలుగు ప్రజలందరితో చీవాట్లు తిన్నారు. ఏపీలో ఏం పరిశ్రమలు వచ్చాయంటే… అప్పడాలు, పచ్చళ్లు అంటూ అసెంబ్లీలో అందరినీ నవ్వించారు. ఇప్పుడు విపక్షంలోనూ ఆయన అదే హాస్యం పండిస్తున్నారు.  రుషికొండ ప్యాలెస్ విషయంలో  తమ ప్రభుత్వ తప్పేమీ లేదన్నట్టుగానే మాట్లాడుతున్నారు. లేటెస్ట్ గా ఆయన అమరావతిలో వైసీపీ ఆఫీస్ కూల్చివేత నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత తర్వాత.. ఏపీవ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాలకు నోటీసులు అందజేయడం పై స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు తమ  ప్రభుత్వం చేసిన కూల్చివేతల వల్లే తమకు విపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని లేదంటే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఉండేవాళ్లమని  ఆయనో పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చేశారు. ఆ ఒక్క మాటతో జనమంతా త్రివిక్రమ్ శ్రీనివాస్ తరహాలో జేబులో చేతులు పెట్టుకుని  వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది.అధికారంలో ఉన్నప్పుడు తాము అరాచకాలకు పాల్పడ్డామని గుడివాడ అమర్నాథ్ తన నోట చెప్పినట్లయ్యిందని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి….

పార్టీని డిఫెండ్ చేయడంలో తప్పులేదు. రోజువారీ మీడియా ముందుకు వచ్చి  యాక్టివ్ గా ఉండటం  కూండా సమంజసమే. కాకపోతే గుడ్డు మంత్రి టైప్ స్టేట్ మెంట్లు మాత్రం ఆమోదయోగ్యం కానివి. ఎందుకంటే అవి పార్టీకి మేలు చేసేం కంటే కీడు ఎక్కువ చేస్తాయి. వైసీపీ పెద్దలు ఆ సంగతి తెలుసుకంటే మంచిదే…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి