మైలవరం…టీడీపీకి శిరోభారం

By KTV Telugu On 28 December, 2023
image

KTV TELUGU :-

వసంత వెంకట  కృష్ణప్రసాద్ మళ్లీ గెలుస్తారా.. ఈసారి దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన్ను పడగొడతారా. మూడో   అభ్యర్థి వచ్చి మధ్యలో  కూర్చుంటారా. లోకల్ నాన్ లోకల్ వివాదాలు, కుల పట్టింపులు అక్కడ  బాగా పనిచేసే అవకాశం ఉందా. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గం అన్ని పార్టీలను టెన్షన్ పెట్టిస్తోందా. నేతల మదిలో ఏముంది, మైలవరంలో ఏం జరగబోతోంది….

ఆంధ్రా పాలిటిక్స్ అనగానే మైలవరం అనే స్థాయిలో అక్కడి రాజకీయాలు  పాతుకుపోయాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో భాగమైన ఆ నియోజకవర్గం విజయవాడ లోక్ సభ పరిధిలో ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున వసంత కృష్ణప్రసాద్ గెలుపొందారు. ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో హోమ్ మంత్రిగా కూడా  పనిచేశారు. దూకుడు స్వభాగం ఉన్న వసంత కృష్ణప్రసాద్ నియోజకవర్గంలో బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడైనప్పటికీ పోటీదారుడు కూడా అదే సామాజికవర్గం నుంచి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటడంతో మైలవరం  హాట్  టాపిక్ అవుతోంది.పైగా కృష్ణప్రసాద్ అలియాస్ కేపీ.. వైసీపీలోనే ఉంటారా.. లేక టీడీపీలోకి  వచ్చి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆయన  అధికార  పార్టీలో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కేపీ తరచూ కనిపించకుండా  పోతున్నారని, అధిష్టానంపై అలుగుతున్నారని వార్తలు  వచ్చాయి. వైసీపీలో అంతర్గత   కుమ్ములాటలకు కూడా మైలవరం నియోజకవర్గంలో నిత్యకృత్యమైంది. మైలవరంలో మంత్రి జోగి రమేష్ జోక్యం చేసుకుంటున్నారంటూ  అగ్గిమీద గుగ్గిలమైన కేపీ.. నేరుగా అధిష్టానానికే ఫిర్యాదు చేశారు. దానితో జగన్ స్వయంగా జోగి  రమేష్ ను పిలిచి సర్దిచెప్పారు. ఐనా కొంత కాలం కీచులాట కొనసాగి..ఇప్పుడు తాను ప్రాతినిధ్యం వహించే పెడనలోనే డౌట్లు రావడంతో జోగి రమేష్.. మైలవరం నుంచి సైడైపోయారు. ముందు తన నియోజకవర్గం చూసుకుందామని నిర్ణయించుకున్నారు. కమ్మ సామాజికవర్గంలో కొందరినైనా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సీఎం జగన్..తనకు సన్నిహితులుగా ఉంటారని కొడాలి  నాని, వసంత కృష్ణ ప్రసాద్ కు ప్రత్యేక స్వేచ్ఛ ఇచ్చారు. అయితే వసంతకు ఇప్పుడు వైసీపీ గెలపుపై నమ్మకం తగ్గి పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారమూ ఉంది. జనంలో కూడా వసంత పట్ల ఆగ్రహం పెరిగిపోతోంది. గడప గడపకు ఆయన్ను  నిలదీస్తున్నారు. కేపీ మాఫియా రాజ్యం నడిపిస్తున్నారన్న  ఆరోపణలు  కూడా చాలా సార్లే వచ్చాయి. ఇసుక, గ్రావెల్,బూడిద అక్రమ మైనింగ్ చేస్తున్నారనీ..టీడీపీ  ససాక్ష్యంగా నిరూపించినా వైసీపీ  ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా మాజీ  మంత్రి ఉమ అక్కడకు వెళ్లితే వైసీపీ  కార్యకర్తలు దాడులు చేసేందుకు ప్రయత్నించారు..

మైలవరంలో టీడీపీ పరిస్థితేమిటన్నది పెద్ద ప్రశ్న. ఈసారి ఉమా  పోటీ చేయాలనుకుంటున్నారా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మరో పక్క ఎన్టీయార్ జిల్లాలో  ఒకటి రెండు సీట్లు అడగాలనుకుంటున్న జనసేన.. అందులో మైలవరాన్ని కూడా తమ  ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. అక్కల రామ్మోహన్ రావు కోసం టికెట్ అడగాలనుకుంటోంది..

దేవినేని  ఉమామహేశ్వరరావు.. 2009.. 2014లో టీడీపీ తరపున మైలవరంలో గెలిచారు. నీటి పారుదల శాఖామంత్రిగా  పనిచేశారు. ప్రాజెక్టుల  నిర్వహణ  తీరు భేష్ అనిపించుకున్నారు. 2019  వైసీపీ ప్రభంజనంలో ఆయన ఓడిపోయినప్పటికీ ఉమ రాజకీయాల్లో క్రియాశీలంగానే ఉంటున్నారు. ఉమకు  అక్కడ మంచి  పేరు కూడా ఉంది. దానితో  ఈ సారి ఉమ పోటీ చేస్తే విజయం ఖాయమని  చెబుతున్నప్పటికీ  ఆయన నియోజకవర్గం మార్చాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.టీడీపీ ప్రభుత్వం వస్తే ఉమ సేవలు అవసరమైతున్నందున ఆయనకు ఇంతకంటే సేఫ్ సీటు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. అందుకు మరో కారణం కూడా ఉంది. జనసేనకు మైలవరం నియోజకవర్గం కావాలని అడిగితే కాదనలేని పరిస్థితి రావచ్చు. ఆ పార్టీకి చెందిన అక్కల రామ్మోహన్ రావు  చాలా ఆశలు పెట్టుకున్నారు. 30 ఏళ్లు కాంగ్రెస్ లో ఉన్న ఆయన గత ఎన్నికల్లో జనసేనలో చేరి పోటీ చేశారు. మూడో స్థానానికి పరిమితమయ్యారు. రామ్మోహన్ రావు… అప్పటి నుంచి జనంలోనే ఉంటూ జనం సమస్యలు పరిష్కరిస్తూ జనసేనాధ్యక్షుడు పవన్ కల్యాణ్ దృష్టిని ఆకర్షించారు. పైగా ఇప్పుడు స్థానిక, స్థానికేతర వివాదం కూడా ఆయనకు ఉపయోగపడుతుందని  భావిస్తున్నారు.  ఉమా, వసంత ఇద్దరూ నందిగామ నుంచి వచ్చిన వాళ్లు. రామ్మెహన్ రావు స్థానికుడు.  కాకపోతే నందిగామలో కుల సమీకరణాలు కూడా పనిచేస్తాయని ప్రత్యేకంగా  చెప్పాల్సిన  పనిలేదు. మైలవరం నియోజకర్గంలో 8 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉంది. 5 లక్షల జనాభా ఉండగా.. దాదాపు 3 లక్షలమంది కమ్మ ,కాపులే ఉన్నారు. బీసీ, ఎస్సీలు 2 లక్షల వరకు ఉంటారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని చెప్తున్న జనసేన… టిడిపితో కలిసివెళ్తే మాత్రం సీటు ఎవరికి దక్కుతుందనేదే తేలాల్సి ఉంది.

టీడీపీ పోటీ చేస్తే జనసేన కేడర్ సపోర్టు చేస్తుందా. జనసేనకు టికెట్ కేటాయిస్తే టీడీపీ వాళ్లు కలిసి నడుస్తారా అన్నది  పెద్ద ప్రశ్నే అవుతుంది. కమ్మవారికి కంచుకోటగా ఉన్న కొండపల్లి ఖిల్లా ప్రజలు.. ఆదరిస్తారా? అనేదీ అనుమానమే. టికెట్ల బట్వాడాలో  టీడీపీ ఈ సంగతి ఆలోచించుకోవాలి. నియోజకవర్గ  విషయాలు బాగా తెలిసినందునే వైసీపీ హాయిగా నిద్రపోతోందన్న చర్చ నడుస్తోంది. మనోడు వసంత ఎక్కడికి పాతాడులే మన దగ్గరే ఉంటాడని  కూడా వారి నమ్మకం…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి