వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక… సోనియాపైన… కాంగ్రెస్ పైన జగన్‌తో పాటు షర్మిల కూడా విమర్శలు చేశారు. అన్నీ మర్చిపోయి షర్మిలను పార్టీలోకి తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. అయితే ఇక్కడ షర్మిల ఎంత బలంగా నిలబడతారన్నదానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే షర్మిల పార్టీ పెట్టింది రాజకీయంగా నిలదొక్కుకోవడం కన్నా… ఆస్తుల పంచాయతీని తేల్చుకోవడానికన్నా అభిప్రాయం ఉండటమే కారణం. తెలంగాణలో పోటీకి వెనుకడుగు వేసినట్లుగా.. ఏపీలో తన పంతం నెరవేరిందని మధ్యలోనే కాడిపడేస్తే కాంగ్రెస్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అవుతుంది.
వైఎస్ షర్మిల ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు అంటే.. ఏకగ్రీవంగా అందరూ చెప్పే సమాధానం అన్న జగన్‌తో విబేధాలు. ప్రజలకు సంబంధం లేదని సొంత ఎజెండాతో పార్టీ పెట్టుకుంటే… తమ డిమాండ్ నెరవేరగానే మధ్యలో రాజకీయానికి గుడ్ బై చెబుతారు. ఇప్పుడు షర్మిల విషయంలోనూ ఇవే అనుమానాలు వస్తున్నాయి. మొదట షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. అది రాజకీయంగా పెద్ద బ్లండర్ అని.. కనీస ఆలోచన ఉన్న వాళ్లు ఎవరూ అలాంటి పని చేయరని అప్పట్లోనే చెప్పుకున్నారు. కానీ షర్మిల పార్టీ పెట్టారు. పాదయాత్ర చేశారు. తాను సీఎం అవుతానని చాలెంజ్ లు చేశారు. చివరికి పోటీ చేసే పరిస్థితి కూడా లేదని తెలుసుకుని వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఆఫర్ ఇవ్వడంతో అంగీకరించారు. అయితే తెలంగాణలో రాజకీయం చేస్తే ఎవరూ అభ్యంతర పెట్టలేదు.. కానీ ఏపీలో కాంగ్రెస్ ను బలపరుస్తానంటే మాత్రం…అనేక ఒత్తిళ్లు వస్తాయి. ముఖ్యంగా కుటుంబం నుంచి ఆమెపై వచ్చే ఒత్తిళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడటానికి కారణం అందరూ అనుకుంటున్నట్లుగా రాష్ట్ర విభజన కాదు. రాష్ట్ర విభజన కన్నా అసలు కారణం… వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కూడా సొంత పార్టీ పెట్టుకోవడంతో నాయకుడు లేకుండా పోయారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు, క్యాడర్ అంతా…వైసీపీ పక్కన చేరిపోయారు. రాష్ట్ర విభజన ప్రకటన చేసిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది కూడా. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టింది మాత్రం వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకోవడమే. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎక్కడ కోల్పోయామో అక్కడే వెదుక్కునే ప్రయత్నంలో వెదకబోయిన తీగ కాలికి తగిలిన చందంగా. వైెస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెనే కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధపడ్డారు. ఏపీ బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధం కావడంతో ఇక ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు షర్మిల వల్ల కాంగ్రెస్‌కు వచ్చే లాభం ఎంత ?. ఎంత మేర క్యాడర్,లీడర్ల వెనక్కి వస్తారన్నది ఇక్కడ కీలక అంశం. అంతే కాదు మధ్యలో ఆమె కుటుంబంతో రాజీ పడిపోతే ఎలా అన్నది మరో అంశం.
ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఒక్క శాతం ఓట్లు కూడా రావడం లేదు. షర్మిల పార్టీలోకి వస్తే కొన్ని వర్గాలతో పాటు కొంత మంది వలస నేతలు వస్తారని నమ్ముతున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరుతామని ప్రకటించారు. వైసీపీలో టిక్కట్ల కసరత్తు పూర్తి అయిన తర్వతా టీడీపీ, వైసీపీలో టికెట్లు దక్కని నేతలే రేపు కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోకి దిగినా ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే.. వైసీపీ, టీడీపీలపై ఎంత మేరకు ప్రభావం ఉంటుందనేది అంచనా వేయడం తొందరపాటే అవుతుంది. అయితే కాంగ్రెస్ బలపడితే.. దెబ్బతినేది జగన్ రెడ్డేనని అందరికీ తెలుసు.. కాంగ్రెస్ కు నాయకత్వం లేకపోవడం వల్ల లీడర్, క్యాడర్ అంతా జగన్ వెంట వెళ్లారు. ఇప్పుడు షర్మిల ఆ లోటు తీరుస్తారని అనుకుంటున్నారు. అంటే వైసీపీ క్యాడర్ మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ చూస్తూ ఉండిపోరు.
వైఎస్ షర్మిలతో రాజీకి జగన్ ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అవకాశాలు పొందాలంటే ముందు పార్టీని బలోపేతం చేయాలి. ఆ తర్వాతే అవకాశాలు వస్తాయి. ఇలా చేయాలంటే అన్న కుర్చీ కిందకు నీళ్లుతేవాలి. కుటుంబం చేతుల్లో ఉన్న అధికారాన్ని పరుల పాలు చేయడం ఎందుటని ఆమెపై అందరూ కలిసి ఒత్తిడి తెస్తే నిర్ణయం మార్చుకోరన్న గ్యారంటీ లేదు. చ్చి.. ఆస్తులు పంచేస్తే.. షర్మిల సైలెంట్ అయినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. తమకు నష్టం జరిగితే… జగన్ ఆమెను పోటీ నుంచి తప్పించడానికి చేయని ప్రయత్నాలు ఉండవు.. ఆమె ఏ కారణంతో విబేధించారో అన్ని షరతులు ఒప్పుకుని అయినా పోటీ నుంచి విరమింపచేయాలనుకుంటే. కాంగ్రెస్ ను మళ్లీ చావుదెబ్బకొట్టాలనుకుంటారు. ఇలాంటి ఒత్తిళ్లను అధిగమించి… కాంగ్రెస్ పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని షర్మిల నిలబెట్టుకోవాల్సి ఉంది. ఒక వేళ షర్మిల మధ్యలో హ్యాండిస్తే.. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ ఫ్యామిలీ భయంకరమైన దెబ్బను రెండో సారి కొట్టినట్లవుతుంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…