ఐ ప్యాక్ వర్సెస్ వైసీపీ – IPAC vs YSRCP

By KTV Telugu On 1 April, 2024
image

KTV TELUGU :-

వైసీపీకి ఐప్యాక్ మధ్య సంఘర్షణ మొదలైంది. ఎన్నికల్ల వ్యూహాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు అర్థం చేసుకోకుండా ఐ ప్యాక్ టీమ్ రెచ్చిపోతోంది. దానితో వైసీపీలో తీవ్ర అసహనం మొదలైంది. త్వరలో ఆ గాలి బుడగ పేలిపోయే ప్రమాదం ఉందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఈ పెత్తందారీతనాన్ని ఎక్కువ కాలం  సహించలేమని వైసీపీలో కొందరు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.

చాలా కాలం క్రితం బిహారీ  బాబు ప్రశాంత కిషోర్ ఐ ప్యాక్ ను ప్రారంభించారు. సర్వేలు చేయడం, రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాలు రచించడం ఐ ప్యాక్ పని. సక్సెస్ రేటు ఎక్కువగా ఉండటంతో  పార్టీలన్నీ ఐ ప్యాక్ వెంట బడ్డాయి. ప్రశాంత్ కిషోర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. దానితో తానే స్వయంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న కోరిక ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకేలో పెరిగిపోయింది. ఫుల్ టైమ్ తిరిగేందుకు ఆయన ఐ ప్యాక్ కు గుడ్ బై చెప్పి రిషి రాజ్ సింగ్ కు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఏపీలో వైసీపీకి ఐ  ప్యాక్ టీమ్ పనిచేస్తోంది. 2019లో వైసీపీని  గెలిపించింది కూడా ఐ ప్యాకే కావడంతో ఆ  టీమునే కొనసాగిస్తున్నారు. ఐతే 2019కి, 2024కు చాలా తేడా ఉందని వార్తలు వస్తున్నాయి. ఆ ప్యాక్ టీమ్ పెత్తందారీతనం భరించలేకపోతున్నామని వైసీపీ నేతలు తలలు పట్టుకు కూర్చుంటున్నారు. తమ ఆలోచనలను పక్కన  పెట్టి ఐ ప్యాక్ టీమ్ చెప్పినట్లు  వినాల్సి వస్తోందని వాళ్లు లబోదిబోమంటున్నారు…

వైసీపీ బాస్ జగన్ కు ఐ ప్యాక్ టీము చాలా దగ్గరగా ఉంటుంది. వాళ్లను  ఏమన్నా అంటే వెంటనే బాస్ కు తెలిసిపోతుందన్న భయం  వైసీపీ వర్గాల్లో పెరిగిపోతోంది. అందుకే వాళ్లు ఏం చెప్పినా, ఏం చేసినా మౌనంగా భరించాల్సిన అనివార్యత ఏర్పడిందని క్షేత్రస్థాయి నేతలు వాపోతున్నారు…

ఎమ్మెల్యే అభ్యర్థులదీ ఏమీ లేదా. అంతా ఐప్యాక్ పెత్తనమేనా అన్నది తొలి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ప్రచారం ఎలా ఉండాలో…ఎవరు ఎక్కడికి వెళ్లాలో లాంటి ఆంశాలు మొత్తం ఐ ప్యాక్ బృందమే దిశానిర్దేశం  చేస్తోంది. ఏ ప్రాంతంలో ఎవరికి, ఎంత క్యాష్ కొట్టాలో కూడా వాళ్లే నిర్ణయించి  అభ్యర్థుల అనుచరులకు వివరిస్తున్నారు. వోటర్లకు పంచే  బహుమతుల విషయంలోనూ వారి పెత్తనమే నడుస్తోంది. వలంటీర్లంతా వాళ్ల కనుసన్నల్లోనే నడవాలని ఆదేశాలు వెళ్లాయి. గ్రామాల్లో తిరిగి  సర్వేలు చేస్తూ వ్యూహాలు రచించే ఐ ప్యాక్ బృందాలకు అతిథి మర్యాదలు చేయలేక చచ్చిపోతున్నామని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడొచ్చిన ఐ ప్యాక్ టీముకు మాకంటే ఎక్కువ తెలుసా అన్నది అభ్యర్థుల ప్రశ్న. పైగా టీములో సభ్యులు తరచూ మారిపోతున్నారని దానితో పరిస్థితి మొదటికొస్తోందని కూడా వారు ఆరోపిస్తున్నారు. మరో ఐ ప్యాక్ స్వయంగా  ఓ ప్రణాళిక రూపొందించి ఇచ్చి దాన్నే  ఫాలో చేయాలని అభ్యర్థులకు ఆదేశిస్తోందని సమాచారం.  వాటిని పాటించకపోతే… తర్వాత జరిగే పరిణామాలకు తాము  బాధ్యత వహించబోమని కూడా హెచ్చరిస్తున్నారట. అంటే మాట వినకపోతే జగన్, సజ్జల, విజయసాయికి ఫిర్యాదు చేస్తామన్నట్లుగా ఆ బెదిరింపు ఉందని క్షేత్రస్థాయి నేతలు టెన్షన్ పడుతున్నారు.

ఐ ప్యాక్ లో క్షేత్రస్థాయి పనివారు వస్తూ పోతూ ఉంటారు. ఎవరూ నిలకడగా ఉండరు. వచ్చిన వాళ్లు తమకు తామే  బాసులుగా భావిస్తుంటారని కూడా జనంలో టాక్ ఉంది. తమకు ఇచ్చిన పనికి సంబంధించిన రిజల్ట్ ఐ ప్యాక్ బాసులకు చేరితేనే సంస్థలో అవకాశాలు పెరుగుతాయన్నది వారి నమ్మకం. అందుకే కొంత సొంత పెత్తనం కూడా నడుస్తోంది.కాకపోతే ఈ సారి జగన్ ను ఏదో విధంగా గెలిపించి..ఎన్నికల వ్యూహాల్లో తమ సత్తా చాటాలని ఐ ప్యాక్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఓవరాక్షన్ పెరిగిందని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి