ప్రజా వ్యతిరేకతను జగన్ పట్టించుకునేందుకు జగన్ సిద్ధంగా లేరు. జనం ఆలోచన ఎలా ఉన్నా.. తన విధానాలు వారిపై రుద్దాలన్న ప్రయత్నం ఆయనలో కనిపిస్తోంది. అందుకే అక్టోబరు 11 దగ్గర పడుతోందంటే ఏపీ జనానికి వణుకు పడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలపైకి వైసీపీ దండయాత్ర ప్రారంభిస్తోందని తెలియడంతో వాళ్లు భయంభయంగా గడుపుతున్నారు. నెలరోజుల పాటు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో వాలంటీర్లు, వైసీపీ నేతలు ఇళ్లలోకి చొరబడారని తెలియడంతో ఎటైనా వెళ్లిపోదామని జనం అనుకుంటున్నట్లు సమాచారం.
గడప గడపకు కార్యక్రమం సూపర్ ప్లాప్ అయినప్పటికీ జగన్ తగ్గేదేలే అంటున్నారు. అగ్రనాయకుల నుంచి ఛోటా నేతల వరకు అందరని జనం నిలదీసి, ఛీత్కరించినా ఏ మాత్రం వెనుకాడే పరిస్తితి కనిపించడం లేదు. బలవంతంగా జగన్ స్టిక్కర్లు అంటించి వెళితే, వాళ్లు వెళ్లిపోయినా తర్వాత చించేసిన దాఖలాలు కోకొల్లలుగా ఉన్నాయి. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలన్నట్లుగా వైసీపీ నేతలు మళ్లీ జనంలోకి వస్తున్నారు. ఇటీవలే జగన్ ….పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి 175 స్థానాల్లో మళ్లీ గెలవాలని పిలుపునిచ్చారు. చాలా మంది ఎమ్మెల్యేలను మార్చేస్తామన్నారు. వారికి నామినేటెడ్ పదవులు ఆశ చూపి ఇప్పుడు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరినీ రోడ్డుమీదకు దించుతున్నారు. రాబోయే ఆరు నెలలు చాలా కీలకమని జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వమే రావాలని తెలిపిన ఆయన… రాకపోతే ఏమవుతుంది, వస్తే ఏమవుతుంది అనే విషయాలను ప్రజలకు వివరించేందుకే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వైసీపీ వర్గాలు అంటున్నాయి.
ఇప్పటికే వాలంటీర్లు వచ్చి బెడ్ రూముల్లో కూర్చుంటున్నారని జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రతీ ఇంటిపై వారి నిఘా పెరిగిపోయింది. ఇప్పుడు మళ్లీ అదే వాలంటీర్లతో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నాలుగున్నరేళ్లుగా చేసిన అభివృద్ది, రోడ్లు, ఉద్యోగాలు ఇవేవీ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగం కావు.. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఇళ్లకు వచ్చి పథకాలను వివరించినట్లుగానే ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలను ఏకరవు పెడతారు. దీనికి అదనంగా గత ప్రభుత్వంలో ఆ కుటుంబానికి అందిన లబ్ధిని పోల్చుతూ వివరించే ప్రయత్నం చేస్తారు. జనం సంతకాలు తీసుకుంటారు. ఈ ఇంటి వారికి నచ్చితే, వాళ్లు అంగీకరిస్తే ప్రహరీకి వైసీపీ జెండా కట్టి వెళతారు.
ఐ ప్యాక్ నే మళ్లీ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ నెల 11 నుంచి వచ్చే నెల 11 వరకు నెల రోజుల పాటు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కార్యక్రమ నిర్వహణా తీరుపై ఇప్పటికే ఐ ప్యాక్ బృందం నియోజకవర్గాల్లో శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేసింది. ఇంటింటి ప్రచారం కోసం కౌన్సిలర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లతో కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ రోజుంతా తిరిగి సాయంత్రానికి ఓ నివేదిక రూపొందిస్తుంది. ప్రతీ ఒక బృందం చేతిలో ఒక కిట్ ఉంటుంది. అందులో సుమారుగా 100 వైసీపీ జెంతాలతో పాటు ఇతర ప్రచార సామాగ్రిని సిద్దం చేస్తున్నారు. పథకాల లబ్ధి వివరాలతో ఒక షీటును లబ్ధిదారుల దగ్గరకు తీసుకెళ్లి వారికి అందిన పథకాలను తెలిపే సంతకం తీసుకుంటారు. ఎవరికైనా పథకాలు అందకపోతే ఆ వివరాలు నమోదు చేసుకుంటారు… జగన్ రెడ్డి పట్ల ఎంత వ్యతిరేకత ఉందో తెలుసుకునేందుకు ఇదో గేమ్ ప్లాన్. పథకాల లబ్ధి వివరాలు షీటును పూర్తి చేసే క్రమంలోనే జననాడి కాస్త అర్థమవుతుంది. జెండానే ఓటు బ్యాంకుకు ప్రామాణికమని వైసీపీ భావిస్తోంది. ప్రభుత్వం పట్ల ప్రజల సానుకూలతకు అదే అద్దం పడుతుంది.
ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పుడు జగన్ కు లెక్క లేదు. మొత్తం వ్యవహారాన్నా వాలంటీర్లతో నడిపించాలని చూస్తున్నారు. పథకాలు వారి చేతుల మీదుగా అమలవుతున్నాయి కాబట్టి వారు చెబితే భయపడతారని.. వారిని ముందు పెట్టి వైసీపీకి ఓటు వేస్తారా చస్తారా అన్న భావన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంత మంది సంతకాలు పెడతారో కానీ.. ప్రజల్ని భయపెట్టడానికి చేయాల్సినదంతా చేస్తున్నారు. పైగా సంతకాలు పెట్టకపోతే, జెండా కట్టేందుకు ఒప్పుకోకపోతే దాడులు జరుగుతాయన్న భయమూ ఉంది. దొంగ కేసులు పెట్టి అరెస్టు చేసినా ఆశ్చర్యం లేదన్న అనుమానమూ ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ జనాన్ని వైసీపీ ఓటర్లుగా మార్చే ప్రక్రియలో జగన్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…