జగన్ ఓటమిని ఒప్పుకున్నారా ?

By KTV Telugu On 10 May, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక  తీరుగా ఉంటే చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే కుప్పం మరో తీరుగా ఉంది. చంద్రబాబును ఓడించి తీరాలని జగన్ కంకణం కట్టుకుని పావులు కదుపుతున్న వేళ, టీడీపీ అధినేత మెజార్టీ పెంచాలని ఆయన పార్టీ శ్రేణులు వ్యూహరచన చేస్తున్నాయి. పైగా గత రెండు సంవత్సరాలుగా  జగన్ వేసిన ఎత్తులు కుప్పంలో టీడీపీ జాగ్రత్త పడేందుకు అవకాశమిచ్చాయి. కప్పుంలోనే ఎక్కువ డబ్బులు చేతులు మారుతున్నట్లుగా

2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనే టీడీపీ ఖంగుతిన్నది.  ఒక్క నాయుడు  ప్రాతినిధ్యం వహించే కుప్పం మినహా ఆ పార్టీ ఎక్కడా గెలవలేదు. అక్కడ కూడా మెజార్టీ తగ్గింది. అప్పట్లో వైసీపీ ప్రభంజనమే అందుకు కారణం కావచ్చు. తర్వాతి కాలంలో జగన్ రెడ్డి , కుప్పంపై ప్రత్యేక దృష్టి  పెట్టారు. ఏదో విధంగా చంద్రబాబును కుప్పం నుంచి తరిమెయ్యాలని డిసైడయ్యారు. ఆ బాధ్యతను పుంగనూరు ఎమ్మెల్యే అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. చంద్రబాబు చిత్తూరు  వైపు వెళితే అడ్డుకోవాలని వైసీపీ శ్రేణులు డిసైడయ్యాయి. పుంగనూరు, అంగళ్లు ఘటనలు అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. అప్పటి నుంచి కుప్పం సంఘర్షణ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు సీటును  కాపాడుకునేందుకు టీడీపీ నానా తంటాలు పడుతోంది. ఈ క్రమంలో ఎన్నికల దగ్గర పడటం ఇరు పార్టీలు కుప్పానికి డబ్బు సంచులు తరలించడం జరిగిపోయింది. కుప్పంలో గెలుపు కోసం చెరి 150 కోట్లు కుమ్మరిస్తున్నారని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఓటుకు నాలుగు వేలు పంచేశారని చెబుతున్నారు. ప్రతీ సారీ వందో రెండు వందలో ఇచ్చి ఓట్లు వేయించుకునే టీడీపీ ఇప్పుడు అనివార్యంగా వేల రుపాయలు విదిల్చాల్సి వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మట్టి కరిచిన టీడీపీ  ఈసారి చాన్స్ తీసుకో దలచుకోలేదని అందుకే విచ్చలవిడిగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని చెబుతున్నారు…

కుప్పం ప్రజలను, బయటి వారిని ప్రభావితం చేసేందుకు వైసీపీ  వ్యూహకర్తలు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ గేమ్ ఆడుతున్నారు. 35 ఏళ్ల చంద్రబాబు ప్రాతినిధ్యంలో కుప్పం అథోగతిపాలైందని లెక్కలేస్తున్నారు. ఏపీకి చిట్టచివరి నియోజకవర్గంగా తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతంగా ఉన్న కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోవడం లేదని ప్రచారం చేస్తున్నారు.దానితో టీడీపీ డిఫెన్స్ లో పడిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది..

1980ల ద్వితీయార్థం నుంచి చంద్రబాబు నాయుడు, కుప్పానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పులివెందులను వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి చేసినట్లుగా కుప్పాన్ని చంద్రబాబు ముందుకు తీసుకెళ్లలేదని అక్కడి జనంలో ఒక వర్గం వాదిస్తుంది. పట్టణ  మౌలిక  సదుపాయాల విషయంలో కుప్పం బాగా వెనుకబడిపోయిందని వాపోతున్నారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను అక్కడ ఏర్పాటు చేయలేకపోయారు. ఒక జాతీయ రహదారి ఉన్నప్పటికీ గ్రామీణ రోడ్ల విషయంలో కుప్పం బాగా  వెనుకబడిపోయింది. అట్టహాసంగా ప్రారంభమైన ద్రవిడ విశ్వవిద్యాలయంలో బోధనా సిబ్బంది నియామకం జరగడం లేదు. విద్యార్థుల సంఖ్య 30 శాతానికి పడిపోయింది.కుప్పానికి హంద్రీ నీవా జలాలు ఎండమావిగానే మిగిలిపోయాయి. ఉద్యానవన పంటలు ఒక్కటే కుప్పానికి  హైలైట్ అని చెప్పక తప్పదు. చుట్టుపక్కల అడవుల్లోనే 200 ఏనుగులు వచ్చి పంటలను నాశనం చేస్తుంటే ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపలేకపోయింది. కుప్పంలో ఉపాధి అవకాశాలు లేక రోజు కూలీలు పొరుగు రాష్ట్రాల్లోని హోసూరు, కోలార్  వెళ్తుంటారు. దానితో కుప్పం ఇప్పుడు సమస్యల కేంద్రంగా మారింది…

వైనాట్ 175 అన్నది జగన్ నినాదం. అంటే కుప్పంలో కూడా గెలుస్తామని ఆయన చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ  కేజేఆర్ భరత్ ఇప్పుడు చంద్రబాబుకు ప్రత్యర్థిగా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఓడిపోయారు. ఈ సారి  మాత్రం గెలిచి చూపిస్తామని, తన గెలుపును జగన్  కు కానుకగా ఇస్తానని ప్రకటిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో……

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి