తెలంగాణ బోర్డర్ లో ఉండే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట రాజీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. అక్కడ ప్రముఖ నేతలు ఉన్నా మంత్రి పదవులకు మాత్రం ఎప్పుడూ దూరంగానే ఉంటారు. అయితే ఈ సారి అక్కడ్నుంచి గెలిచే వారికి ఏ పార్టీ తరపున అయిన మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం ఉంది. తెలుగుదేశం పార్టీ తరుపున శ్రీరామ్ రాజగోపాల్ పోటీ చేయడం ఖాయమయింది. వైసీపీ అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలే్దు. సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారుతారన్న ప్రచారంతో ఆయనకు టిక్కెట్ ఖరారు చేయలేదు. దీంతో అధికార పార్టీలో గందరగోళం ఏర్పడింది. జనసేన పొత్తు.. టీడీపరీ సంస్థాగత బలం కలిపి కూటమికి ఏకపక్షంగా ఈ నియోజకవర్గం కనిపిస్తోంది.
జగ్గయ్యపేటకు సిమెంట్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పేరుంది. కృష్ణా జిల్లాలోని ప్రధాన ఇండస్ట్రియల్ కారిడార్లలో ప్రధానమైంది. దాదాపుగా 10 సిమెంట్ తయారీ ఫ్యాక్టరీలు జగ్గయ్యపేట చుట్టుపక్కల ఉంటాయి. సంప్రదాయంగా టీడీపీకి బలమైన నియోజకవర్గం. ఇక్కడ కమ్మ, కాపు సామాజికవర్గాలు బలంగా ఉంటాయి. అయితే టీడీపీ తరపున వైశ్య వర్గానికి చెందిన శ్రీరాం రాజగోపాల్ కీలక నేతగా ఎదిగారు. ఆయన రెండు సార్లు గెలిచినా గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా సామినేని ఉదయభాను ఉన్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య ద్విముఖపోరు నడిచింది. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సామినేని ఉదయభాను 50 శాతం ఓట్లు సాధించి గెలిచారు. అదే సమయంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీరాం రాజగోపాల్ 47 శాతం ఓట్లు సాధించారు. ఇతరులకు 3 శాతం ఓట్లు వచ్చాయి. 2009, 2014 ఎన్నికల్లో ఓడిన సానుభూతి ఉదయభానుకు పనికి వచ్చింది. అయితే ఐదేళ్లుగా జగ్గయ్యపేటలో అభివృద్ధి పనులేమీ జరగకపోవడం మైనస్‌గా మారింది. సామినేని ఉదయభానుపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే సమయమంలో ఆయనకు సీఎం జగన్ టిక్కెట్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. చివరికి వాసిరెడ్డి పద్మ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. దీంతో ఉదయభాను వేరే దారి చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ అందరితో కలిసిపోయే నేత. పార్టీ కార్యకర్తలే కాదు నియోజకవర్గంలో ఎవరు పిలిచినా పలుకుతారు. ఇళ్లలో శుభకార్యం అయినా .. చావు కార్యం అయినా ఖచ్చితంగా వెళ్లి పలకరించి వస్తారు. నేనున్నా అన్న భావన కల్పిస్తారు., ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటారు.. సహాయం కోసం వచ్చిన వారిని ఆదుకుంటారు. పేదల మెడికల్ బిల్లులు, కాలేజీ ఫీజుల చెల్లింపులు సొంతంగా చెల్లిస్తారు. అడగకపోయినా తెలిస్తే వెళ్లి సాయం చేసి రావడం శ్రీరాం రాజగోపాల్ స్టైల్. గత ఐదేళ్ల పాలనా వ్యతిరేకత…ఎమ్మెల్యేపై వ్యతిరేకత కలసి వచ్చే అవకాశఆలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా టీడీపీ నేతలు గట్టిగా నిలబడ్డారు. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో గెలిచినంత పని చేశారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రస్తుతం లీడ్ లో కనిపిస్తున్నారు. టిక్కెట్ కోసం మాజీ మంత్రి నెట్టెం రఘురాం ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి చాలా కాలం అయింది. పార్టీ హైకమాండ్ నిర్ణయం ప్రకారం నడుచుకునే పరిస్థితి ఉండడంతో ఓట్లు చీలిపోకుండా శ్రీరాం తాతయ్యకు కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక టీడీపీ జనసేన పొత్తుతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా టీడీపీవైపు పడేందుకే ఎక్కువ అవకాశాలున్నట్లు సర్వేలో తేలింది. చంద్రబాబు అరెస్ట్ సింపథీ కూడా ఈ సెగ్మెంట్ లో బలంగా పని చేసేలా కనిపిస్తోంది. కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయి. గత ఎన్నికల్లో ఉదయబాను నిలబడటం వల్ల ఆ వర్గం ఓట్లు అన్నీ వైసీపీకే పడ్డాయి. ఈ సారి మాత్రం పరస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. వైసీపీ తరపున ఉదయభాను నిలబడినే కాపు ఓట్లు కూటమికి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…