పవన్ ఎంపీగా వెళ్లాలన్నది చంద్రబాబు వ్యూహమా ?-JANASENA-PAWAN KALYAN-TDP- CHABDRABABU

By KTV Telugu On 11 March, 2024
image

KTV TELUGU :-

పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారన్న ఓ ప్రచారం కొద్ది రోజులుగా ఉద్ధృతంగా సాగుతోంది.   అసలు పవన్ ఎప్పుడూ ఇలాంటి ఆలోచన ఉందని బయటకు వెల్లడించలేదు. కానీ ఎందుకు ప్రచారం జరుగుతోంది ?. కూటమి గెలిస్తే మరో పవర్ సెంటర్ ఉండకూడదన్న లక్ష్యంతో చంద్రబాబే ఆయనను ఎంపీగా పంపాలని అనుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.  మరి దీనికి పవన్ అంగీకరిస్తారా ?

తెలుగుదేశం-జనసేన కూటమిగా 100 సీట్ల వరకూ ప్రకటించి అందులో నారా లోకేశ్, చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు వంటి నేతలు ఎక్కడ్నించి పోటీ చేస్తారనేది క్లారిటీ వచ్చింది. జనసేన తరపున నాదెండ్ల మనోహర్ ఎక్కడ్నించి పోటీ చేస్తారో కూడా తేలింది. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడ్నించి పోటీ అనేది ఇంకా సందిగ్దంలోనే ఉంది.  ఈసారి పపవ్ కళ్యాణ్ అటు అసెంబ్లీ ఇటు లోక్‌సభ రెండింట్లో పోటీ చేయవచ్చని సమాచారం. ఎందుకంటే తెలుగుదేశం-జనసేన విజయం సాధిస్తే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండవచ్చు. అంతకంటే ఎక్కువగా కేంద్రంలో మరోసోరి బీజేపీ రావడం ఖాయమని భావిస్తున్న తరుణంలో ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఉంటుందనేది ప్రధాన ఆలోచన.

ఇదంతా ప్రచారంగానే జనసేన నేతలు చెబుతున్నా.. ఒక ఎమ్మెల్యే, మరో ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మాత్రం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.  కాపు సామాజికవర్గం బలంగా ఉన్న అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ లోక్‌సభకు పోటీ చేయవచ్చని తెలుస్తోంది. గతంలో పీఆర్పీ సమయంలో అల్లు అరవింద్ ఇక్కడ్నించి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి తెలుగుదేశం మద్దతు ఉన్నందున పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారనే అంచనా ఉంది. ఇక అసెంబ్లీ అయితే ఎక్కడ్నించి అనేది ఇంకా స్పష్టత లేదు.  గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల్నించి పోటీ చేసి ఓడిన పవన్ కళ్యాణ్ ఈ సారి పోటీ చేసే విషయంలో పక్కాగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఏపీ నుంచి ఒక్క ప్రతినిధి కూడా లేరు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డే.. ఏపీకి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారని అనుకోవాలి. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి  కంద్ర మంత్రులు ఉండటం ఆనవాయితీ. అయితే ఈ సారి ఏపీ నుంచి ప్రభుత్వంలో చేరే మంత్రులు ఎవరూ లేరు.  బీజేపీ నాయకత్వం కూడా తమ పార్టీ నేతలకు ఎవరిరైనా రాజ్యసభ ఇచ్చి కేంద్రమంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఆ స్థాయి నేతలు ఎవరూ లేరని అనుకుందేమో  తెలియదు.  ఈ సారి కేంద్రంలో ఖచ్చితంగా ఏపీ నుంచి కేంద్ర మంత్రి ఉండే అవకాశం ఉంది. ప్రతీ సారి నిర్లక్ష్యం చేయలేరు. ఎన్డీఏ కూటమిగా బరిలోకి  దిగుతున్నందున పార్టీలకు  మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలి. ఈ క్రమంలో  పవన్ నే  కేంద్ర మంత్రిగా తీసుకుంటే… బ్యాలెన్స్ అవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు.  కేంద్ర కేబినెట్ మంత్రి పదవి అంటే..  రాష్ట్ర ముఖ్యమంత్రితో సమానం. పవన్ కు ఆ స్థాయి ప్రాధాన్యత ఇస్తే గౌరవించినట్లు ఉండటమే కాకుండా.. రాష్ట్రం కోసం ఢిల్లీలో పనులు చక్కబెట్టే పవర్ ఫుల్ లీడర్ గా కూడా ఉంటారన్న అంచనాలు ఉన్నాయి.

అయితే పవన్ కల్యాణ్‌కు ఇప్పటి వరకూ ఎంపీగా పోటీ చేయాలన్నఆలోచన లేదు. అనకాపల్లి నుంచి ఆయన సోదరుడు నాగబాబు పేరు వినిపించింది. ఆయన ఇల్లుకూడా తీుకుని రంగంలోకి దిగారు. ఎందుకో కానీ మళ్లీ  సైలెంట్ అయ్యారు. ఇప్పుడు పవన్ అక్కడ్నుంచి పోటీ చేసినా ఆశ్చర్యం లేదు. పవన్  కల్యాణ్..బీజేపీ నేతల సూచనలకు పాటిస్తే.. ఎంపీగా  పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నారు. పవన్ వచ్చే ఎన్నికల తర్వాత  ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నారు కానీ.. అధికారంలో ఎలాంటి పాత్ర పోషించాలన్నదానిపై మాత్రం ఎలాంటి ఆలోచనలు  చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా  ఉండాలా.. సీఎం హోదా ఉండే కేంద్రమంత్రిగా ఉండాలా అన్నది ఆయన చాయిస్సే అనుకోవచ్చు . రెండు ప్రాధాన్యాలు ఇప్పుడు పవన్  ముందు  ఉన్నాయి. రాజకీయంగా  విమర్శలు చేసే వాళ్లు ఎప్పటికీ చేస్తూనే ఉంటారు. వాటిని పట్టించుకోకుండా.. తన రాజకీయం తాను చేస్తే.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది

అయితే ఇదంతా చంద్రబాబు వ్యూహమన్న అనుమానాలు కూడా జనసేనలో ఉన్నాయి.  పవన్ కల్యాణ్ ను కేంద్రానికి పంపితే.. తాను ఇక్కడ చక్రం తిప్పవచ్చని భావిస్తున్నారని అనుమానిస్తున్నారు.  ఈ విషయంలో బీజేపీ ఆలోచన ఎలా ఉంటే.. పవన్ ఆ నిర్ణయం తీసుకునే అవకాశాాలు  ఉన్నాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి