చిత్తూరు జిల్లా వరకు తానే ముఖ్యమంత్రిని అనుకునే వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కష్టకాలం తప్పేలా లేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయన్ను టార్కెట్ చేశారు. తాము అధికారానికి వచ్చిన వెంటనే ఆయన సంగతి తేల్చేస్తామన్నారు. పెద్దిరెడ్డి అరాచకాల చిట్టా తమ దగ్గర ఉందని చంద్రబాబు అంటున్నారు. పెద్దిరెడ్డి ఇలాకాలోకి వెళ్లీ మరీ ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.పైగా జూన్ 4 డెడ్ లైన్ కూడా పెట్టేశారు….
చంద్రబాబు, పెద్దిరెడ్డి ఇద్దరిదీ చిత్తూరు జిల్లానే. ఇద్దరూ కాంగ్రెస్ లో ఉన్నవారే. చంద్రబాబు టీడీపీలో చేరి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా పెద్దిరెడ్డి నధింగ్. ఇప్పుడు కూటమిలో భాగంగా బీజేపీ తరపున రాజంపేటలో పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి సీఎంగా ఉన్నప్పుడు కూడా పెద్దిరెడ్డి ఒక బచ్చా. అప్పట్లో చిత్తూరు డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన పెద్దిరెడ్డి రెండు సార్లు తన కాళ్లు పట్టుకున్నారని కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరులో ఉమ్మడి ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు, కిరణ్ రెడ్డి పాల్గొన్నారు ఇద్దరూ పెద్దిరెడ్డిపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. తరచూ పెద్దిరెడ్డిని విమర్శించే చంద్రబాబు ఈ సారి డోస్ పెంచారు. పెద్దిరెడ్డి కొవ్వు కరిగించే టైమ్ వచ్చిందని ప్రకటించేశారు. పెద్దిరెడ్డికి బుల్లెట్ దిగుద్ది. ఇక్కడ బుల్లెట్ లాంటి నాయకుడు,.. చల్లా రామచంద్రారెడ్డిని బరిలో నిలిపాం. పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేసే సరైన మొగుడు మన చల్లా బాబు. ఈయనకు ఓట్లేసి గెలిపించాలి అని చంద్రబాబు స్థానికులకు పిలుపునిచ్చారు. అంతేకాదు.. సుమారు 15 ఏళ్లుగా పెద్దిరెడ్డి కబంద హస్తాల్లో.. పుంగనూరు ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు.
జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. అప్పటి నుంచి పెద్దిరెడ్డికి అసలు సినిమా కనిపిస్తుందని చంద్రబాబు ప్రకటించేశారు. పెద్దిరెడ్డి అరాచకాలను ఒకటొకటిగా బయటకు తీసి విచారణ జరుపుతామని కూడా ఆయన చెప్పేశారు. పైగా వైసీపీలోనే చాలా మందికి పెద్దిరెడ్డిపై గుర్రుగా ఉంది. చిత్తూరు జగన్ గా మారిన పెద్దిరెడ్డిని నేలకు దించాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమని కూడా వైసీపీ నేతలే నమ్ముతున్నారు….
పెద్దిరెడ్డి చేసిన పాపాలు రాస్తే ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ కూడా సరిపోదని టీడీపీ ఆరోపోిస్తుంది. పెద్ది రెడ్డి మంత్రిగా ఉంటూ, తన కుమారుడిని ఎంపీని చేసుకుని, తన తమ్ముడికి ఎమ్మెల్యే ఇప్పించుకుని జిల్లా మొత్తాన్ని చేతిలో పెట్టుకున్నారని కూడా టీడీపీ గుర్తు చేస్తోంది. చిత్తూరు జిల్లా మొత్తం పెద్దిరెడ్డి పెత్తనమే నడుస్తోంది. చివరకు ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా కూడా ఆయన చెప్పినట్లు వినాల్సిందే. మైనింగ్, శాండ్, గ్రావెల్, మద్యం ఏది చూసినా పెద్దిరెడ్డి బ్రాకెట్ లోకే వస్తున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. 15 ఏళ్లుగా పెద్దిరెడ్డి కబంద హస్తాల్లో పుంగనూరు ప్రజలు అల్లాడుతున్నారని, వారికి విముక్తి కలిగించే సమయం వచ్చిందని టీడీపీ హెచ్చరించింది. ఇందుకోసం ప్రజలు సహకరించాలని చంద్రబాబు స్వయంగా విజ్ఞప్తి చేశారు. మంత్రికి టీడీపీ వాళ్లు పెట్టిన పేరు పాపాల పెద్దిరెడ్డి. ఆయన పాపాల నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తామని , దోచుకున్న వేల కోట్లు కక్కిస్తామని చెబుతున్నారు.
ఫలితాలు వచ్చిన మరుసటి రోజు అంటూ జూన్ 5 నుంచి ఆపరేషన్ పెద్దిరెడ్డి మొదలవుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో స్కామును బయటకు తీసి విచారణ జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తామని కూడా అంటున్నారు. నిజానికి ఒక పెద్దిరెడ్డి ఒక్కరే కాదు. వైసీపీలో చాలా మంది పెద్దిరెడ్లు ఉన్నారని వారందరి భరతం పట్టే రోజు వచ్చిందని టీడీపీ లెక్కలేస్తోంది. చూడాలి మరి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…