కేఏపాల్‌ కరెక్ట్‌ చెప్పాడు.. అక్కడైతే లోనేసేవాళ్లు!

By KTV Telugu On 30 December, 2022
image

ఇదే అమెరికాలోనైతేనా తీసుకెళ్లి లోపలేసేవాళ్లు. చంద్రబాబు కందుకూరుసభమీద ప్రజాశాంతిపార్టీ అధ్యక్షుడు మత ప్రబోధకుడు కేఏ పాల్‌ వ్యాఖ్యలివి. చంద్రబాబు ఒక్కడేనా మిగిలినవాళ్లు పెట్టుకోవడంలేదా అని పార్టీవాళ్లు వితండవాదం చేయొచ్చు. కానీ ఎనిమిదిమంది ప్రాణాలు పోవడానికి కారణమైన సభ కాబట్టే చంద్రబాబుని వేలెత్తి చూపించాల్సి వస్తోంది. చంద్రబాబుని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేసిన కేఏపాల్‌ ఇంత అనుభవం ఉన్న నాయకుడికి మీటింగ్‌ ఎక్కడ పెట్టుకోవాలో తెలీదా అని ప్రశ్నించారు.

ఇరుకుసందుల్లో గొందుల్లోనైతే జనం కిక్కిరిసి కనిపిస్తారు. అదే ఏ గ్రౌండ్‌లోనైతే జనం వచ్చారో సభ వెలవెలబోయిందో కళ్లముందు కనిపిస్తుంది. అందుకే టీడీపీ అధినేత ఏరికోరి ఆ ఇరుకు ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఆడియో ఫంక్షన్లు జరిగినప్పుడే హీరోలు అభిమానులకు వంద జాగ్రత్తలు చెబుతారు. తమ నాయకుడి సభ జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనిస్తూ జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత టీడీపీ నేతలకు లేదా? పాతికలక్షలు ఇచ్చేస్తే బాధితులు ఎవరూ నోరెత్తరనే కదా!

వెయ్యిరెండువేలమంది పట్టేచోట పాతికముప్ఫైవేలమంది గుమిగూడితే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయో కందుకూరు విషాదమే నిదర్శనం. అమెరికాలో అయితే ఈపాటికి అరెస్ట్‌ చేసేవారన్న కేఏపాల్‌ మాటలు యదార్థం. మన దగ్గరే ఈ దరిద్రం. నడిరోడ్లపైనే పార్కింగులు జనవాసాల మధ్యే మీటింగులు. అడిగేవాడే ఉండడు. అదేమంటే కక్షసాధింపంటూ అల్లరి చేయొచ్చు. చంద్రబాబు దొరికారని తలోమాటనేస్తే సరిపోదు. అధికారపార్టీ కూడా తనవైపునుంచి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. తమ కక్కుర్తి రాజకీయాలకు సామాన్యులు సమిధలు కాకుండా చూసుకోవాలి.